కందం:
*జనియించుట పొలియుటకే*
*పెను సుఖమొందుటది కష్ట విధి నొందుటకే;*
*విను హెచ్చుట తగ్గుటకే;*
*యని మనమున నమ్మవలయునయ్య కుమారా !*
తా:
కుమారా! మానవులు పుట్టేది, మరణించడానికే. సుఖములు వచ్చేది, కష్టాలు వస్తాయి అని చెప్పడానికే. ఎదైన పెరిగేది తగ్గడానికే. ఈ విషయాలు మనసులో ఉంచుకోవాలి.............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"బంతి ఎంత పైకి వెళితే, అంతకు రట్టింపు వేగంతో క్రిందకు వస్తుంది". ఈ భూమి మీద పుట్టిన ప్రతీ జీవి, కదిలేదైనా, ఈదేది అయినా, నడిచేది అయినా, మరణించాల్సిందే. మంచి కలప చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా, విరిగి నేలకు రావలసిందే. భూమికి వెన్నెలలతో వెలుగులు ఇస్తున్న చంద్రుడు కూడా, తరువాత 15 రోజులూ క్షీణించవలసిందే. మిట్ట మద్యాహ్నం వరకూ సమస్త లోకాలకు వెలుగును ఇవ్వడానికి ఉదయాద్రిన ఉదయించే సూర్యుడు కూడా, సాయంత్రానికి అస్తాద్రికి చేరి విశ్రమించవలసిందే. "పెరుగుట విరుగుట కొరకే" అనేది ప్రకృతి సిద్ధమైన లక్షణం. ఈ లక్షణానికి, ఈ చరాచర జగత్తు లో ఏదీ అతీతం కాదు. కనుక, ఈ సత్యాన్ని ప్రతీ క్షణం మనసులో ఉంచుకుని, దేనిమీదా మమతానురాగాలు, రాగ ద్వేషాలు పెంచుకోకుండా, జీవించ గలిగే సద్బుద్ధిని మనకు అందరకూ ఇవ్వమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి