ఉగాది బాలల కథల పోటీ-2023 ఫలితాలు విడుదల
 బాలలలో సాహిత్యాభిరుచిని పెంపొందించడానికి , వారిలో దాగివున్న సృజనాత్మకత ను వెలికితీయడానికి   సుగుణ సాహితి సమితి సిద్దిపేట ఆధ్వర్యంలో నిర్వహించిన  జిల్లా స్థాయి ఉగాది బాలల కథల పోటీలు -2023 ఫలితాలను  సుగుణ సాహితి సమితి కన్వీనర్ కన్వీనర్ భైతి దుర్గయ్య శుక్రవారం సిద్దిపేట లో విడుదల చేసారు.. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 217 కథలు రాగా ,కథల పోటీకి న్యాయనిర్ణేతగా ప్రముఖ బాలసాహితీవేత్త ,పరిశోధకులు  డా.వాసరవేణి పర్శరాములు వ్యవహరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు మర్పడగ చెన్నకృష్ణా రెడ్డి  సౌజన్యంతో మార్చ్ నెలాఖరు లో నిర్వహించనున్న సమావేశంలో విజేతలైన బాల కథకులకు బహుమతి ప్రధానోత్సవము ఉంటుందని కన్వీనర్ తెలిపారు.
 బహుమతి పొందిన కథల వివరాలు :
(మొత్తం బహుమతులు -20 )
ప్రథమబహుమతి ( 1500 / - నగదు ) :అన్న ప్రేమ -పి.ఆదిత్య వర్ధన్ (ప్రా.ఉ.పా. చందాపూర్ ) ,ద్వితీయ బహుమతులు  (1000/- నగదు ) తల్లి దండ్రుల విలువ - డి. సంజన (జి.ప. ఉ.పా.ఇందిరానగర్ ), సర్కారు బడి - వై.రేవంత్ ( శ్రీ చైతన్య టెక్నో స్కూల్,సిద్దిపేట ),తృతీయ బహుమతులు  (500/- నగదు)  కోరిక -వై.జాహ్నవి ( జి.వ.ఉ.పా ( బాలికలు ) కొండపాక ) ,ఫోన్ తో జాగ్రత్త- పి ఐశ్వర్య ( జి.ప. ఉ..పా. గుర్రాలగొంది ), మంచితనం చేసే మేలు - యం.వరుణ్ తేజ్ ( మెరీడియన్ హై స్కూల్ సిద్ధిపేట). ప్రోత్సాహక బహుమతులు ( 300 / - నగదు ) 1.ప్రేమగా పెంచుకున్న కుందేలు -జి ప్రభాకర్ ( జి.ప. ఉ.పా ( బాలురు ) కొండపాక ,2.మూడు కోరికలు  - జి.ప్రణమ్ చంద్ర ( జ.ప. ఉ.పా.చిన్న కోడూర్),3.కోతి బతుకే నయం- పి . వైష్ణవి ( జి.వ.ఉ. పా.జక్కాపూర్ ),4.ధైర్యం - md . సమీర్ బాబా ( జి.వ .ఉ..పా .చిన్నకోడూర్ )5.,జింక సహాయం-టి. పూజ ( జి.ప ఉ.పా మర్కూక్ ) ,6.చెట్టు మీద దయ్యం-పి.అఖిల- ( జి.ప.ఉ.పా.ఇందిరానగర్ ) 7.,పంట మార్పు -యం. గణేష్ ( జి.ప ఉ.పా జక్కాపూర్ ) ,8.మంచి స్నేహం-ఎ . సంయుక్త ( జి.ప.. ఉ.పా ( బాలికలు ) కొండపాక),9.ఇష్టం - SK అసీన్ ( జి.ప.ఉ.పా .ముబారస్ పూర్), 10.మంచి మాటలకు మార్పు - సిహెచ్ . అక్షిత ( జి.సి. ఉ.పా .లక్ష్మీదేవిపల్లి ),11.వృక్ష ఘోష - బి .అంజలి ( జి.ప. ఉ.పా. వేచరేణి ) ,12.మనిషి విలువ - బి . మహేశ్వరి ( జి.ప.ఉ.పా .సికిందలాపూర్ ),13. డబ్బు పిచ్చి -ఆర్ . సాత్విక్ రెడ్డి (జి.ప.ఉ.పా. నర్మెట్ట) 14.అన్నయ్య బాధ్యత -జి రక్షిత ( జి.ప.ఉ.పా . రామునిపట్ల )
/- భైతి దుర్గయ్య
- కన్వీనర్,
సుగుణ సాహితి సమితి సిద్దిపేట
9959007914

కామెంట్‌లు