మన ఆకాశవాణి;- డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నాన్నకు రేడియో కార్యక్రమాలు వినడం చాలా ఇష్టం. ఇంట్లో రేడియో ఎప్పుడు మోగుతూ ఉండవలసిందే నాన్న వింటున్నప్పుడు నేను  నాటకాలు సాహిత్య కార్యక్రమాలువినడం అలవాటయింది. అయితే ఎప్పుడూ నాకు  రేడియో  కేంద్రానికి వెళ్లి పరిశీలనగా చూడాలని అభిప్రాయం రాలేదు. గురువుగారు ఆనంద్ గారు పరిచయం అయిన తర్వాత అక్కడ విశేషాలు అన్నీ చెబుతూ ఉంటే నాకు ప్రతిదీ ఆశ్చర్యంగానే ఉండేది  ఒకరోజు ఉత్సాహం  ఉండబట్టలేక అక్కడ విశేషాలు చెప్పమని అడిగితే  నీకు ఏం కావాలో అడుగు చెప్తాను అన్నారు. అలా కాదు రేడియో మీకు పరిచయం అయినప్పటి నుంచి  కార్యక్రమాలు ఎలా రూపొందిస్తారు. వాటిని ఎవరెవరు ఎలా నిర్వహిస్తారు  వాటన్నిటినీ ఎన్నిక చేసేది ఎవరు  దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని ఉంది  అని అడిగినప్పుడు  ఒకరోజు కూర్చోబెట్టి వివరంగా చెప్పారు. మొదట ఈ కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు  ఆల్ ఇండియా రేడియో  అన్న పేరుతో ఉండేది ఏ కేంద్రం వారు ఆ కేంద్రం పేరు చెప్పి  ఉదాహరణ విజయవాడ వారు చెప్పాల్సి వస్తే  ఏ కార్యక్రమం ప్రారంభించవలసినా మొదట్లో ఆకాశవాణి  అని కాకుండా  ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం అని చెప్పి ఆ కార్యక్రమం వివరాలను  ప్రకటించి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు  చివరలో ఈ కార్యక్రమాన్ని విన్నారు అని ముగిస్తారు. భారతదేశం మొత్తం మీద ఢిల్లీ కేంద్రంలో నిర్వాహకులుగా పనిచేస్తున్న మెల్వెల్ డి మెల్డో మంచి కంఠం స్పష్టత  ఉండేది వారి ప్రసంగాలలో  ఆంగ్లంలో వార్తలు కూడా వారే చదివేవారు. ఇందిరాగాంధీ  ప్రారంభ దశలో ప్రసార శాఖ మంత్రిగా చేసింది, ఆ తర్వాత ప్రధానమంత్రి. ఒకరోజు ఆంగ్లంలో వార్తలు చదువుతూ  ఆల్ ఇందిరా రేడియో  ఐ యాం సారీ ఆల్ ఇండియా రేడియో అని తన తప్పు సవరించుకున్నాడు. ఆ తెల్లవారి  కేంద్రంలో  ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఫెర్నాడేస్ నాయకుడు జరిగిన విషయం చెప్పి  ఇందిరాగాంధీతో క్షమాపణలు చెప్పించాడు  సభా ముఖంగా. ఆ తర్వాత  దానికి సంబంధించిన అధికారిని పిలిచి  ఈరోజు నుంచి ఆల్ ఇండియా రేడియో అన్న శబ్దం కాదు ఆకాశవాణి  అని మార్చండి అంటూ జీవో ను  తీసుకు రమ్మంది.  అలా పేరు మార్చారు  భారతదేశంలో ఉన్న అన్ని కేంద్రాలు అలాగే చెప్పినవి కానీ  మద్రాస్ కేంద్రం వారు మాత్రం  వారి భాషలో తప్ప మరో భాషలో చెప్పం  అని  చెన్నై నాలోని నిలయం అంటూ తమిళంలో చెప్పుకునేవారు.  కేంద్ర ప్రభుత్వం కూడా దానిని మార్చలేకపోయింది  ఆకాశవాణి అంటే  శూన్యంలో నుంచి వచ్చే శబ్దం  అని అర్థం వచ్చేలా  చాలా మంది చెబుతూ ఉంటారు కానీ  ఆ కాశ వాణి అని చెప్పేవారు చాలా తక్కువ.


కామెంట్‌లు