వ్యక్తుల మనస్తత్వాలు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆ ట్రైనింగ్ కుర్రవాడికి ఒక అక్క ఉంటే ఆమె పరిస్థితి ఏమిటి  రోజు హాస్యాలాడుకుంటూ సరదాగా కొట్టుకుంటూ ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ  ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగా ఉండే  ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహిస్తే  తాను చదువుతున్న పుస్తకంలో ఉన్న ఏ ఒక్క అక్షరం  మనసుకు పట్టదు  ప్రతి అక్షరంలోనూ తమ్ముడే కనిపిస్తూ ఉంటాడు  వాడి చిలక పలుకులు  చిరు దరహాసం  హాస్యాలు  అనుక్షణం జ్ఞాపకం వస్తూ ఒక్క క్షణం కూడా  నిలకడ లేకుండా చేస్తుంది  ఈ మానసిక ఆవేదనలు బయటకు చెప్పుకునేవి కావు  కానీ ప్రతి ఒక్కరూ తప్పక అనుభవించేవే  కనుక ఇవేవీ విశ్లేషకులకు కొత్తగా కనిపించవు అనిపించవు కూడా. మాతృ ప్రేమ పితృ ప్రేమ తర్వాత  అక్క ప్రేమే కదా ముఖ్యం  అతనికి మాత్రం ఇవన్నీ జ్ఞాపకం రాకుండా ఉంటాయా  తనూ ఇలాగే ఆలోచిస్తాడు కదా అని వీళ్ళు ఆలోచిస్తే  కొంచెమైనా ఉపశమనం కడగదా. తండ్రుల మనస్తత్వం మరొక రకంగా ఉంటుంది  మనుషుల పుట్టుకే  రకరకాల మనస్తత్వాలతో కూడినదై ఉంటుంది  దానికి తగినట్లు  చాలా తక్కువ మందిలో ద్వంద్వ ప్రకృతి ఉంటుంది  వారు అనుకుంటున్నది ఒక రకంగా ఉంటుంది బయట అనేది మరొక రకంగా ఉంటుంది  తను ఊహించిన దానికి చేస్తున్న దానికి సంబంధం ఉండదు. దూరంగా ఉన్న కొడుకు మీద ప్రేమ లేకుండా ఉంటుందా ఏ తండ్రికి అయినా. దానిని బయటకు చెప్పుకోడు  కొడుకుకు పెళ్లి  అయిన తర్వాత పిల్లలతో కాలక్షేపం చేస్తూ హాయిగా  సుఖంగా గడపాలన్న  ఆలోచనతో ఉంటాడు ఆయన. బిడ్డకు సంతాన ప్రాప్తి లేకపోతే  ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఓపిక పట్టి  నేరుగా తన దగ్గరికి వెళ్లి  ఆసుపత్రికి వెళ్లి  పరీక్షలు కూడా చేయిస్తాడు. ఇక కుర్రవాడు ఉద్యోగంలో ప్రవేశించినప్పుడు  తల్లి తాను చేస్తున్న ప్రతి పనిలోనూ  కుమారుడే కనిపిస్తూ ఉంటాడు  చిన్నప్పటి వాడు కొంటి వేషాలు  తరువాత తనకు సహకారిగా ఉన్న రోజులు  కొంచెం పెరిగిన తర్వాత హాస్యోక్తులు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. తాను ఉండేది పల్లెటూరు వాళ్ళు ఉండేది నగరం వీళ్లు ఆస్తిపాస్తులు అమ్ముకుని అక్కడికి వెళ్ళలేరు అతను ఉద్యోగం వదిలి ఇక్కడికి రాలేడు  ఇద్దరి మనసులోనూ ప్రేమ రగులుతూనే ఉంటుంది.  అమ్మ గుర్తు రానివాడు ఎవడైనా ఉంటాడా ఈ ప్రపంచంలో  ఆమె ఈ ప్రపంచాన్ని భౌతికంగా వదిలి వెళ్ళిపోయిన తరువాత కూడా  తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన  అమ్మతో కలిసి కదా ఆ క్షణాలను ఎవడైనా మర్చిపోగలడా? ఒకవేళ మర్చిపోతే వాడంత నీచడు ప్రపంచంలో ఉంటాడా.


కామెంట్‌లు