నేడు.. టీ వీల ప్రభావం ! ;- శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
👌మనకు లోకం తీరు, 
     భక్తి ద్వారా ముక్తి,  
     కలిగించు మన"టీవి" 
               ఓ తెలుగు యువత! 

👌టీ వీల ప్రభావము 
     చూపుతుంది మనకు 
     మంచికిని, చెడునకును 
                    ఓ తెలుగు యువత! 

👌యాంకర్లదే జోరు!
     ప్రకటనలదే హోరు!
     చూడండి ఒకమారు!
                 ఓ తెలుగు యువత! 
              ( తెలుగు యువత పదాలు., శంకర ప్రియ., )

👌"టెలీ విజన్" అనగా నేటి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన, "దృశ్య శబ్ద సాధనము"! అది... నేటి మానవు లందరికి.. ఎంతో విజ్ఞానదాయక మైనది! కనుక బహుళ ప్రయోజనకారి.. టెలీవిజన్ మీడియా! 


👌"టీ వీ"ని సక్రమ మార్గములో వినియోగించు కున్నప్పుడు.. మేలు కలుగుతుoది! దానిని వక్రమ మార్గములో వినియోగించు కున్నప్పుడు.. కీడు కలుగుతుoది! కనుక, "మంచి - చెడుల మిశ్రమ ఫలితాలకు ఠీవి" ! నేటి మేటి టీవీ! 
          తస్మాత్ జాగ్రత్త! ఈనాటితరం యువతీ యువకులార! 


 🚩సీ స మా లి క 🚩 

     తెరతీసి నంతనే, దీర్ఘకాలపు కథల్
గయ్యాళి కధనాల, కలతపెట్టు

     నేరాలు వినిపించు ఘోరధోరణి, విన
హృదయ కవాటము, రిత్త వోవు

        అశ్లీల భాషణల్,  అరగొరదుస్తుల
నారీమణుల తీరు, నవ్వు పాలు

      క్రీడలవార్తలు, క్రిక్కెట్టు గాంచగ
క్రేళ్ళుర్కిమదిలోన, కేక పెట్టు

      రాజకీయపు వార్త రణరంగ చందమై
భీతిని పుట్టించు, ప్రీతి తొలగు

      పౌరాణికాంశాల, భాష్యాలు వినుచుండ, 
భక్తిభావపు ఝరుల్, మదిని నిండు

       వంట వార్పులు జూసి, వండి వడ్డింతురు
నట్టింట భర్తలు నవ్వుకొనగ, 

      పశుజాతి సంవృద్ది, పాడి పంటల వృద్ధి
దినవార ఫలములు, తేట పరచు, 

      వరుసగా ప్రకటనల్, వాసిగా చూపించు 
ఆదాయవృద్ధికై, సాదరముగ

      సంగీత సాహిత్య కల్హార మాలలు
సంతోష మందించు, సరస గతిని

       హాస్య వల్లరులలో నశ్లీలతలు వచ్చి
కడు జుగుప్సయు కల్గె, కనుల కిపుడు

     సుప్రభాతపు సేవ, సూక్తి ముక్తావళీ
సుంత సాంత్వన మిచ్చు, చూడ గాను

           🚩

తే ట గీ తి 
      కపటహాసము కురిపించి, కనులు తిప్పి

      వార్తలందింప, నమ్మరా వాస్తవముల

       సుంత కల్గు వినోదము, సుంత చింత

       మిశ్రమ ఫలితాలకు ఠీవి, మేటి టీవి.

         (రచన: డా. వేదాల గాయత్రీదేవి.,)
కామెంట్‌లు