సివి రామన్ ,అబ్దుల్ కలాం లాంటి గొప్ప శాస్త్రవేత్తలనుఆదర్శంగా తీసుకోవాలి:మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోరిక విజయలక్ష్మి;- వెంకట్ : మొలక ప్రతినిధి
 తాండూర్ లో ఘనంగా సెయింట్ మేరీ పాఠశాలలో నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్
తాండూర్ టౌన్ మల్రెడ్డిపల్లి లో
సెయింట్ మేరీ హై స్కూల్లో
ప్రిన్సిపల్ జసంతా బస్కో అధ్యక్షతన ఘనంగా నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు ఈ ప్రోగ్రాం లో
విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలు కావాలని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. మంగళవారం జాతీయ వైజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని సెయింట్ మేరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కోట్రిక విజయలక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థులతో మాట్లాడి వైజ్ఞానిక ప్రదర్శనలతో నైపుణ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ భారత శాస్త్ర వేత్త సీవి రామన్‌ 1928లో రామన్‌ ఎఫెక్ట్‌ను ఫిబ్రవరి 28వ తేదిన కనుగొన్నందుకు ప్రతి యేడాది జాతీయ వైజ్ఞానిక దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు సీవీ రామన్, అబ్దుల్ కలాం వంటి మేధావులను ఆదర్శంగా తీసుకుని గొప్ప శాస్త్రవేత్తకాలు కావాలని ఆకాంక్షించారు. దేశానికి, ప్రపంచానికి సేవలందించాలని అన్నారు. 
 కార్యక్రమంలో  భాగంగా   సేంద్రియ వ్యవసాయం, కంటి  మరియు  C. V. రామన్ గురించి  విశ్లేషించి  మాట్లాడారు. అలాగే రామాయణాన్ని  బొమ్మల రామాయణం ల రాసిన  విషయాన్నీ, దేవుని పట్ల ఉండవలసిన భక్తి గురించి  విద్యార్థులతో చక్కగా  చర్చించారు. అలాగే సైన్స్  డే  సందర్బంగా  పాఠశాలలో జరుపుకున్న సైన్స్ మేళా లో గెలుపొందిన విద్యార్థులు ఝాన్సీక,ప్రజ్యోత్  అక్షిత్ రెడ్డిలను సత్కరించారు. అలాగే పాఠశాలలో  దీనితో పాటు వ్యాసరచన పోటీలు, క్విజ్   ఉపన్యాస  పోటీలను నిర్వహించినట్లు  పాఠశాల  ప్రధానోపాధ్యాయులు  జసింతబాస్కో తెలిపారు విద్యార్థుల  నైపుణ్యాలను వెలికితీయడానికి   సైన్స్  దోహదపడుతుందని
అన్నారు ఈ ప్రోగ్రాంలో  సైన్స్ ఉపాధ్యాయులు అపర్ణ, జ్యోతి,  వెంకటలక్ష్మి,  వరలక్ష్మి,  భారతి,విజయలక్ష్మి రాజకుమార్ టీచర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు