సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -61
ఘట సూర్య బింబ న్యాయము
*****
ఘటము అంటే కుండ, కుంభము, శిఖరము, కలశము,గరగ,భాండము,పాత్రము మొదలైన అర్థాలు ఉన్నాయి. బింబము అంటే ఛాయ,నీడ,ప్రతిచ్ఛాయ,ప్రతికృతి,ప్రతిమ, దొండపండు మొదలైన అర్థాలు కలవు.సూర్య బింబము అంటే సూర్యుని యొక్క ప్రతి బింబం, ఛాయ లేదా నీడ. 
ఘట సూర్య న్యాయము అంటే అంత పెద్ద సూర్యుని యొక్క ప్రతి బింబం కుండలోనూ కనిపించడం అన్నమాట.
ఉదయాస్త మయాల్లో తప్ప సూర్యుని నేరుగా చూడలేం.ఎంతో ప్రకాశవంతంగా ఉండి వేడిని, వెలుగును వెదజల్లే సూర్యుని ఆకారాన్ని   నీటిలోనూ చిన్న నీటి కుండలోనూ కూడా చూడ వచ్చు. అలా కనబడినంత మాత్రాన సూర్యుని యొక్క విలువ ప్రకాశం తగ్గి పోదుకదా.
 అనువు గాని ప్రదేశంలో తన గొప్పదనాన్ని ప్రదర్శించు కోవాల్సిన అవసరం లేదు.తనను గుర్తించ లేదని బాధ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు.అలాంటి సందర్భాలను ఉద్దేశించే ఈ ఘట సూర్య న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 అంత పెద్ద ఆకారమైన  సూర్యుడు ఇంత చిన్న కుండలో  ఇమిడి పోయానని బాధ పడతాడా పడడు కదా.
ఇలాంటి న్యాయానికి దగ్గరగా ఉన్న మరో న్యాయము ఘటాల్ప దర్పణ న్యాయము. దర్పణము అంటే అద్దం. ఘటము సంస్కృతంలో కుండ అనే అర్థంతో పాటు ఏనుగు కుంభస్థలం అని కూడా అర్థం ఉంది.
ఈ రెండు న్యాయాలకు వర్తించే ఓ చక్కని పద్యాన్ని  వేమన చెప్పారు.
అనువు గాని చోట యధికుల మన రాదు/ కొంచె ముండుటెల్ల కొదువ గాదు/ కొండ అద్దమందు కొంచమై యుండదా? / విశ్వధాభిరామ వినురవేమ/దీని అంతరార్థం ఏమిటో చూద్దాం.
తమకు అనుకూలం  కాని పరిస్థితుల్లో లేదా ప్రదేశాలలో  ఎంత గొప్ప వారైనా తగ్గి ఉండాలి. అలా తగ్గి, తలొగ్గి నంత మాత్రాన వారి యొక్క గొప్పతనానికి,ప్రతిభ సామర్థ్యాలకూ వచ్చే లోటు, నష్టం ఏమీ ఉండదు. ఎలాగంటే ఎంతో పెద్దదైన కొండ కూడా అద్దంలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది కదా!
అందుకే  కొన్ని చోట్ల మన గొప్పతనం గురించి చెప్పుకోలేని,ప్రదర్శించలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.అంత మాత్రాన మన ప్రతిభకు, ఔన్నత్యానికి వచ్చే నష్టమేమీ ఉండదు. దాని గురించి బాధ పడాల్సిన అవసరం లేదని ఈ రెండు న్యాయాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం