భక్తి సామ్రాజ్యం--సి.హెచ్.ప్రతాప్

 భక్తి సామ్రాజ్యంలో భక్తుడు భగవంతుడిని ఎన్నో రకాలుగా భావించి పూజిస్తుంటాడు. కొందరు భగవంతుడిని తమ నాథుడిగా భావిస్తారు. వారిది మధుర భక్తి. తమకు ఇలలో ఎవరితోను సంబంధ బాంధవ్యాలు ఏమీ అక్కర్లేదు కేవలం భగవంతుడొక్కడుంటే చాలు అతనే ఇహమూ పరమూ అంటారు. వారు భగవంతుడిని తమ భర్తగా భావించి సేవిస్తారు. అండాల్ తల్లి, తరిగొండ వెంగమాంబ ,అక్క మహాదేవి ఇలా ఎందరో భక్తురాండ్రు భగవంతుడినే తమ భర్తగా భావించి తమ జీవితాలను ధన్యం చేసుకొన్నారు.
మరికొందరు భగవంతుడిని తమ సఖుడని, స్నేహితుడని అనుకొంటారు. తమ సంగతులన్నీ స్నేహితునితో చెప్పుకుంటున్నట్టు చెబుతారు. కుచేలుడు కూడా ద్వాపరయుగంలో భగవంతుడైన కృష్ణుడితో ఉంటూ కృష్ణుడిని సఖునిగా భావించి తరించాడు.
దానివలనే భగవంతుడుకూడా పత్రమునైనా, పుష్పమునైననూ లేదా నీటినైనాను భక్తి ప్రేమలతో అర్పిస్తే వాటిని నేను స్వీకరిస్తానన్నారు. తనకూ, జీవుల మధ్య ప్రేమ బాంధవ్యాన్ని కల్పించాడు. సర్వస్వమూ భగవంతుడే అయనప్పుడు ఇలా భగవంతుడిని పూజించడానికి ఎన్నో పద్ధతులున్నాయ.సర్వవ్యాపి అయన భగవంతుడిని సర్వులు వివిధ రకాలుగా పూజిస్తారు. భగవంతుని పూజలో ఆర్భాటాలు చేయనక్కర్లేదు. ఆడంబరాలతో కాక శివపూజను చిత్తశుద్ధితో చేస్తే చాలు చేసింది కొంచెమైనా అదిభక్తితోనూ, మనస్స్ఫూర్తిగా చేయగలిగితే ఆ శివుడు ఆనందపడ్తాడు
వీరేభగవంతునికి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నింటికీ కారణాకారణుడివి నీవే నని వారు భగవంతుని ఎదుట శరణాగతి చేస్తారు. నిస్వార్థబుద్ధితో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఏ పని చేసినా అందులో సత్ఫలితాలు పొందవచ్చు అనేది కూడా పురాణాలే కాక  నిత్యజీవితంలో అనేక సందర్భాలు రుజువు చేస్తుంటాయ.

కామెంట్‌లు