సకల గుణాభి రామా ! రఘుకులసోమా !;- చంద్రకళ యలమర్తి
పుత్ర కామేష్టితో  దశరధుని ఇంట ఉదయించిన  దశరధ రామ! 
ముద్దుల బిడ్డగ  ముగ్గురు తల్లుల మరపించిన కౌసల్య రామ !

అన్న దమ్ముల ప్రేమకు నీవే  నిదర్శన మయిన   సోదర  రామ!   
దనుజుల అణచి  సుజనుల బ్రోచి  లోకాల గాచిన లోకాభిరామ!
   
హరివిల్లు విరచి సీతను పరిణయ మాడిన కళ్యాణ రామ!  
తండ్రి మాట కై  రాజ్యము  విడచి  కానల కేగిన సుగుణాభి రామ!

సీత జాడను కనుగొన్న హనుమను ఆదరించిన స్నేహ రామ! 
 రావణు చంపి  సీతను  ప్రియముగ  కొనివచ్చిన  సీతా రామ! 

ఏక పత్ని వ్రతము  లోకమునకు తెలిపిన ఆదర్శ రామ!
ప్రజల  రక్షణకు రామ రాజ్యము  స్ధాపన చేసిన  పట్టాభి రామ!
   
రాజుగ ధర్మము  నాలుగు పాదముల నిలిపిన రాజారామ!
నిను నమ్మి శరణన్న  భక్తుల బ్రోచే భక్త వత్సల రామ !

రామ జయం శ్రీ రామ జయం రాముని నమ్మిన లేదు భయం! 
రాముని చరితం  ,రమణీయం కమనీయంవిన్నా చదివిన శుభం!           **                                  

కామెంట్‌లు