బైకులపై పిల్లలను తీసుకువెళ్ళే టప్పుడు తగుజాగ్రత్తలు తప్పక
తీసుకొనుట మేలు... !
సరదాల విన్యాసాలు ప్రమాదములు తెచ్చిపెట్టు !
జరగకూడనిది జరిగిన...
జీవితకాలము దుఃఖమె !!
పిల్లనెపుడూ వెనుక కూచో బెట్టరాదు...,
బైకు కుదుపులు, చల్లని గాలులకు
మత్తుఆవహించి వారు తూలీ పడిపోగలరు !
బైకుపైన పిల్లలను తీసుకెళ్ల వచ్చినపు
వారికి మనకూ కలిపి బెల్టు నొకటి కట్టవలెను !
జరగబోవు ప్రమాదాలు నివారించుటే మేలు !
సరదాచేష్ట లెన్నైనా చేయవచ్చు, మన సరదాలు, దుఃఖాలకు దారితీయరాదుకదా... !!
. *******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి