న్యాయాలు -63
ఘృత కోశాతకీ న్యాయము
*****
ఘృతం అంటే నెయ్యి. కోశాతకీ అంటే బీర కాయ.ఘృత కోశాతకీ అంటే నేతి బీరకాయ.
నేతి బీరకాయ పేరులో నెయ్యి ఉంది కానీ బీరకాయలో లేదు.నెయ్యి లాంటి కమ్మని పదార్థం కూడా లేక పోగా కనీసం తినడానికి కూడా రుచిగా కూడా లేకుండా చప్పగా ఉంటుంది.
పాలకూరలో పాలు, పెరుగు తోటలో పెరుగు..ఇలా పేర్లో తప్ప నిజానికి అందులో పాలు,పెరుగు ఉండవని మనకు తెలుసు.
ఘృత కోశాతకీ కూడా ఈ కోవకు చెందినదే. పేర్లు విన్నప్పుడు అందులో పాలు ఉన్నాయేమో, పెరుగు ఉందేమో, నెయ్యి ఉందేమో అనిపిస్తుంది.
ఇలాంటివి చూసేనేమో ''పేరు గొప్ప ఊరు దిబ్బ,' 'ఇంటి పేరు కస్తూరి వారు-ఇల్లంతా గబ్బిలాల కంపు' అనే సామెతలు పుట్టినవి.
ఊరించే,ఊహించే విధంగా ఉన్న ఇలాంటి పేర్లకూ వాటి లక్షణాలకు ఎలాంటి సంబంధం ఉండక పోవడాన్ని వ్యక్తుల్లో కూడా గమనించవచ్చు.కొందరు వ్యక్తులు ఈ కోవకు చెందుతారు.అదెలాగో చూద్దాం.
పేరేమో సత్య హరిశ్చంద్ర .చెప్పేవన్నీ అసత్యాలే.నోరు తెరిస్తే అబద్ధాలే.పేరు ధర్మ రాజు చేసేవన్నీ అధర్మాలే. పేరులోనే కరుణ. కరుణాకర్ . అతనిలో/ ఆమెలో కరుణ ఏ కోశానా కనపడదు.ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉదాహరణలు కనిపిస్తాయి.
అందుకే పేరుకు తగ్గట్టు వాస్తవ జీవితంలో అలా ఉంటారని అనుకోవడం ఒట్టి భ్రమ అని తెలియజేస్తూ,అలాంటి వాళ్ళను ఉద్దేశించే ఈ ఘృత కోశాతకీ న్యాయము వాడుకలోకి వచ్చింది.
కొందరి మాటలు- చేష్టలకు ఎలాంటి సంబంధం ఉండదు. మాటల్లో గొప్పలు తప్ప చేతల్లో ఉండవు. మాటలు విన్నప్పుడు ఆహా! ఎంత గొప్ప మనిషి అని పొగడకుండా ఉండలేం.కానీ ఆ తర్వాత తెలుస్తుంది అతడు ఏమీ చేయడనీ. మాటల్లో తప్ప అలాంటి మంచితనం కాగడా పెట్టి వెదికినా దొరకదు.
అదిగో అప్పుడు అనుకుంటాం .ఆ మనిషి మాటలన్నీ నేతి బీరకాయ చందమని.
ఏమీ లేదు అంతా ఉత్తదే అని అర్థంలో కూడా ఈ ఘృత కోశాతకీ న్యాయమును వాడుతూ ఉంటాం.
నేటి రాజకీయ నాయకుల్లో చాలా మంది చెప్పే మాటలు నేతి బీరకాయల్లాంటివే. దేశ సేవ, ప్రజాసేవ,దీన జనోద్ధరణ లాంటి మనుసుని ఆకట్టుకునే మాటలు.ప్రజల కోసమే తాము ఉన్నామనీ అసలీ రాజకీయాల్లోకి వచ్చిందే అందుకని మైకు పట్టుకుని చెవులు చిల్లులు పడేలా చెప్పే మాటలన్నీ నేతి బీరకాయ వంటివే.
కాబట్టి అలాంటి వారి మాటలు,చేతలను నిశితంగా గమనిస్తూ ఉండాలి.మాటకూ చేతకూ,పేరుకూ వ్యక్తిత్వానికి ఏమైనా సామ్యం ఉందా లేదా చూస్తూ మనల్ని మనం మోసపోకుండా కాపాడుకోవాలి.
ఇలాంటివి చదివినప్పుడు ఉలిక్కిపడి మనల్ని మన పేర్లను తడుముకోవడం సహజం. అలా మన తల్లిదండ్రులు మనకు పెట్టిన పేర్లకు లేదా మన పిల్లలకు మనం పెట్టిన మంచి అర్థవంతమైన పేర్లకు తగ్గట్టుగా ఉన్నామా,అలా వారిని తీర్చిదిద్దుతున్నామా అనేది కూడా ఆలోచించాలి మరి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి