కందం:
*మును గల్గి ధర్మమును జే*
*యునతడు పేద వడెనేని యున్నంతకు దో*
*చిన భంగి నర్ధులకు ని*
*చ్చునతడె బహు పుణ్యపు పురుషుండు కుమారా !*
తా:
కుమారా! ఒక వ్యక్తి వద్ద డబ్బు, సంపద ఉన్నప్పుడు మంచి బుద్ధి తో దాన ధర్మాలు చేసిన తరువాత, తన దగ్గర ఉన్న డబ్బు అమతా తగ్గినా కూడా, తనబదగ్గరకు ఎవరైనా ధనసహాయం కోరి వచ్చినప్పుడు, ఉన్న దాంట్లో కొంత అవతలి వారికి సహాయం చేసినప్పుడు, గొప్ప వాడుగా, మహనీయుడు గా కీర్తింప బడతాడు.............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఒకరి వద్ద ఉన్న, ధనమంతా దాన ధర్మాలు అయిపోయిన తరువాత కూడా అవతలి వారికి ఏదో చేయాలి అని తపన పడటం కన్నా గొప్పతనం ఏమి ఉంటుంది. దీనికి కర్ణ మహారాజు ఒక చక్కని ఉదాహరణ. విద్య నేర్పిన గురువు శాపం ఒక పక్క, కురు వృద్ధులు అందరూ తనకు వ్యతిరేకంగా ఉన్నారని బాధ, యుద్ధంలో తన ప్రతిజ్ఞ కారణంగా శతృ శిబిరానికి, యద్దానికి దూరంలో ఉండాల్సి రావడం, ఇందృడు వచ్చి కవచ కుండలాలు తీసుకు వెళ్ళాడు. ఇప్పుడు, కుంతి మాత వచ్చి తనకు పుత్ర భిక్ష పెట్టమని అడిగితే, కాదనకుండా ఒప్పుకున్నాడు. అందుకే, దాన కర్ణుడు అయ్యాడు. ఇంత మంచి హృదయం మనకు కూడా ఇవ్వమని........ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి