*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 096*
 కందం:
*మిత్రుండు దనకు విశ్వా*
*మిత్రము జేసినను గాని మేలనవచ్చున్*
*శాత్రవుడు ముద్దగొన్నను*
*ధాత్రిం దన కదియె కీడు తలప కుమారా !*
తా:
కుమారా! మన స్నేహితుడు / మంచి కోరేవారు, ఈ ప్రపంచాన్ని అంతటినీ మనకు వ్యతిరేకంగా చేసినా కూడా మనకు మంచి చేసినట్టలే. అలాగే, మనకు శత్రవు,మన చెడు కోరుకునే వారు మనకు వారి ఇంట్లో భోజనం పెట్టినా కూడా అది విషం తో సమానమే అవుతుంది.............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మహాభారతం లో శకుని, నిరంతరం దుర్యోధనాదుల పతనం / నాశనం కోరుకుంటూ, కౌరవుల పక్షంలో ఉంటూ వారితోవస్నేహం చేస్తూనే ఉంటాడు. బయటనుండి చూసే వారికి, శకుని పాండవులకు చెడు చేసే వాడిలాగా కనబడతాడు. కానీ, కౌరవులను రెచ్చగొట్టి, తప్పుల మీద తప్పులు చేయించి, కౌరవుల నాశనానికి, పాండవుల విజయానికి కనబడని కారకుడు అవుతాడు. ఇటువంటి వారు మన పౌర సమాజంలో కూడా లెక్ఖు మిక్కిలి తారస పడతారు. ఇటువంటి వ్యక్తుల నుండీ మనల్ని మనం కాపాడుకునే శక్తిని, ఆలోచనలను ఇమ్మని........ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు