రెడ్డి రాజులు (13);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 భరతుడు అంటేనే  వెలుగును చూపు వాడు అని అర్థం.  ధర్మబద్ధంగా రాజ్యం అన్నకే చెందాలి తప్ప నాకు కాదు  అన్న నిశ్చయంతో  అన్న వ్యతిరేకించినా వారి పాదుకలను తీసుకొని వచ్చి వారి పేరుతో రాజ్యాన్ని పరిపాలించాడు తప్ప తన పేరుతో కాదు  అంతత్యాగశీలి  రేణుకా దేవి పేరు ప్రతి ఒక్కరికి తెలిసినదే  ఈమె జమదగ్ని భార్య పరశురాముని తల్లి  రేణుక అంటే అణువు  జమదగ్ని అంటే  శరీరంలో ఉన్న పంచాగ్నులలో జమదగ్ని ఒకటి  పిల్లలు పుట్టడానికి  కారణభూతమైన అగ్నిగా చెప్తారు  పరశురాముడు  రాజులందరినీ  చంపినవాడు  కథలలో కూడా శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టిన వాడు  వాల్మీకి మహర్షి  ఏ పేరు తీసుకున్నా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది వినడం కోసం అది తెలియడం కోసమే  రామాయణం మీకు నేను చెప్తున్నాను.
స్త్రీ ఏ రంగంలో దిగినా కొమ్ములు తిరిగిన మేధావులను కూడా మూడు చెరువుల నీళ్లు తాగించగలిగిన  ధైర్య సైర్యాలతో  పాటు  ఆలోచనా శక్తితో  వారిని జయించగల శక్తి స్త్రీకి ఉంది  మేధావులకే మేధావిగా చెప్పబడే బ్రహ్మనాయుడుని ఎదిరించి  తన సామర్థ్యాన్ని చూపి  వీరనారిగా నాయకురాలు నాగమ్మ గారు  పేరు సంపాదించకున్న స్త్రీని గురించి మీకు ఈరోజు  చెప్పాలనుకున్నాను  ఆమె గురించి చెప్పిన తరువాత  సహజంగా పిల్లలలో  తమ తెలివితేటలను సక్రమంగా వినియోగించే  స్థితి రాదు  వచ్చినా దానిని  ఉపయోగించరు  మీరు మాత్రం అలా కాకుండా  ధైర్యంగా నిలబడి ధర్మం కోసం  పోరాడే  నారీ మణులుగా తయారు కావడం కోసం  ఆమె జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకు వస్తున్నాను  జాగ్రత్తగా విని  ఆమె కౌశల్యం ఏమిటో తెలుసుకోండి. పలనాటి యుద్ధం లో బ్రహ్మనాయుడుని ఎదిరించి పోరాడిన వీరనారి  నలకామరాజు మంత్రి ఆరవెల్లి నాయకురాలు రెడ్డి నాగమ్మ  ఆమె పుట్టిన ఊరు కరీంనగర్ జిల్లా జగిత్యాల తాలూకా మల్యాల మండలంలో ఆరవీటి  ఇప్పటికీ ఆ గ్రామం వెలుపల పూజలు అందుకుంటున్న నాయకురాలు గుడి ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. చిన్ననాడు అనారోగ్యంతో తల్లి మరణించగా తండ్రితో పాటు మేనమామ ఇంటికి పలనాడు గుంటూరు జిల్లా  వెళ్ళిందట నాగమ్మ.  ఆమె తండ్రి భర్త మరణాలకు కారకుడైన మంత్రి  బ్రహ్మనాయుడు పై పగ పెంచుకొని తన తెలివతేటలతో మంత్రిగా చేరి  అతని సవతి సోదరుడైన మలిదేవరాజాదులపై వైరం రగుల  గొల్పి కోడిపందాలలో ఓడించి వారిని ప్రవాసం పంపింది  మలి దేవరాజు మంత్రి వెలమ వీరుడు బ్రహ్మనాయుడు.


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం