ఎండమావులు ;- డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడపజిల్లా--9440703716

 ఎండమావులు అనే మాట మీరు చాలాసార్లు విని ఉంటారు. అవి కేవలం భ్రాంతి లేదా మిధ్యగా గుర్తించాలి. వీటికి కారణం కాంతి కిరణాల వక్రీభవనం. దూర ప్రాంతాలలోని వస్తువు లేదా దృశ్యం నుంచి ప్రయాణించిన కాంతి పుంజము భిన్న సాంద్రతలు గల గాలిపొరలలోంచి ప్రయాణించడం వల్ల ఈ విధంగా కనబడటానికి అవకాశం ఏర్పడుతుంది. మంచి ఎండ కాస్తున్న సమయంలో తారు రోడ్డు ఎడారి లేదా నల్లరేగడి మన్ను ప్రాంతాలను తీసుకుందాం. నేలకు దాపుగా సూర్యరశ్మి అతి వేడిగా ఉండటం వల్ల అక్కడ గాలి కూడా అధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఇక్కడి నుంచి కొద్ది కొద్దిగా పైకి పోతే గాలి కింద గాలి అంత వేడిగా ఉండదు. అందువల్ల ఈ గాలి సాంద్రతలలో కూడా ఈ తేడా కనబడుతుంది. పై పొరగల గాలి సాంద్రత హెచ్చుగా ఉంటుంది. అందువల్ల దీని వక్రీభవన శక్తి అధికంగా ఉంటుంది.
     ఈ పరిస్థితుల్లో దూరంగా ఒక తాటి చెట్టు ఉంది. దీని పైభాగం నుంచి ప్రయాణించిన కాంతికిరణం పై చల్లని పొరల్లో సామాన్య రీతిలోనే ప్రయాణిస్తుంది. ఈ కాంతి కిరణం సామాన్యంగా మన కంటికి కనబడదు. దాన్ని మార్గం పైనుంచి ఉంటుంది. కానీ భూమికి దాపుల్లో ఉన్న విరళీకృతమైన గాలి పొరల్లోకి ప్రవేశించగానే అది పైకి వంగి మన కంటి మార్గంలో ప్రయాణిస్తుంది.అంటే ఈ వేడిగాలికి దిగువ నుంచి వచ్చిన కిరణం మాదిరిగా ప్రవర్తిస్తుంది. ఈ విధంగా వక్రీభవనము చెందని సామాన్య కిరణాలు, వక్రీభవనము చెందిన కిరణాలు రెండు మన కంటికి చేరి రెండు చెట్ల దృశ్యాలు కనబడతాయి. ఒకటి సామాన్య చెట్టు దృశ్యము. మరొకటి మిధ్యా
దృశ్యము.  ఆకాశమే భూమి మీద ఒక పొర నీరుగా లేదా సరస్సుగా గోచరిస్తుంది. దృశ్యా సందర్భంగా ఇది సత్యం. భౌతిక రీత్యా ఇది ఒక భ్రమ. అక్కడ ఏమీ లేదు. అయినా విశేషం ఏమంటే మంచి కెమెరాలతో ఈ మిధ్యను కూడా బంధించవచ్చు.      వాతావరణంలోని గాలి పొరలు ఈ మాదిరిగా ఏర్పడడం వల్ల ఎండమావులు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా ఎడారిలో సరస్సు ప్రత్యక్షమవుతుంది. మంచి ఎండ కాస్తున్న సమయంలో రోడ్డు మీద ముందు కొలను ఉన్నట్లుగా కనబడుతుంది. వీటికి కారణం కాంతి కిరణాల వక్రీభవనం.
డి.కె.చదువులబాబు.
కామెంట్‌లు