ఓం నమశ్శివాయ!;- గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
ఓం సలేశ్వరాయ ఓం సలేశ్వరాయ
మము బ్రోవగ రావయ్యా ఇక మా మనవిని వినవయ్యా !

ఓం దివ్య విశ్వేశ్వరా రావయ్య
ఓం ఐశ్వర్య రాయ నీవేనయ్యా
మా భవ్య భూతేశ్వరా ఈశ్వరా
హేసవ్య సకల మా లోకేశ్వరరా!

ఓం అర్ధనారీశ్వర మానవ పరమార్థ పరమేశ్వర హర హర మహాదేవ
ఆహాకార హరా నిరాకార ఆకారా
ఓం శ్రీ హర హర మహంకాళిశ్వరా !

ఓం మహా పాపనాశా సర్వలోక
శరశ్చంద్ర మా క్రాంతి ప్రకాశా ఓం
సర్వ ప్రాణ కారుణ్యమూర్తి ఆర్తివై
కదలిరావయ్య మ్మమ్మిక నీవు బ్రోవ 

ఓం ధర్మ రక్షా ప్రసాదించవా జ్ఞాన బిక్ష మహాదేవ శంభో శంకరా మా
బ్రతుకు జీవన పోరాట అభయంకరా కింకరా ఓ శ్రీకరా!

ఓం చితానంద చంద్రమౌళీ 


శివా మహాదానంద మయూరానుభవా
వాగార్ధ రూపాయ విశ్వైక శివాయ
మా కార్యాది రూపాయ రుద్రాయ !

ఓం దిగంబరాయ విశ్వంభరాయ
విశ్వ యోగేశ్వర మా మహేశ్వర
అనుగ్రహించి ఇక మమ్మేలు కోరా
నిగ్రహించి నిధులిచ్చి మమ్మాదుకోరా!

ఓం దీనబాంధవా దయాసింధువా
శ్రీ గిరీశాఈశ శ్రీశైలం మల్లేశా వాసా
నా దీక్షను మెచ్చి ఓవరమునూ ఇచ్చి 
ఆదుకోన రావయ్య నీవే మాదిక్కైయ్య!

మిమ్ము తలచినంత మాకు ఇల
తొలగిపోవు పెక్కు ఇడుముల 
చింత ఆపైన మాకుండు 
శుభములసంత మీ ముందు నేనెంత ?

కామెంట్‌లు