విలువైన నిజాయితీ.;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .9884429899
 అటవిశాఖా విశ్రాంత అధికారి రంగనాథం ఇంటి అరుగుపై కథ వినడానికి చేరిన పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టి 'బాలలు ఈరోజు నిజాయితీ అనేది మనిపికి ఎంతో అవసరం. నిజమైన ఆయనంలో లేక అసలైన మార్గంలో నడుచుకోవడాన్ని నిజాయితీ అంటారు. 
నిజాయితీ అనేది నైతిక పాత్ర యొక్క ఒక విభాగాన్ని సూచిస్తుంది మరియు చిత్తశుద్ధి, యదార్ధం వంటి అనుకూల మరియు సద్గుణ గుణాలనే అర్థాన్ని ఇస్తుంది, అలాగే దురుసుతనం, అబద్ధం, మోసం, దొంగతనం వంటి దుర్గుణాలు లేకపోవడాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా నిజాయితీ అంటే విశ్వసనీయత, విధేయత, నిష్పక్షపాతం, హృదయపూర్వకతనం కలిగి ఉండాలి. నిజాయితి అనేది అనేక జాతి మరియు మతపరమైన సంస్కృతులలో విలువైనదిగా ఉంది. తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసిన వ్యక్తి తన తప్పును తాను గ్రహించి సరిదిద్దుకొనే ప్రయత్నాన్ని నిజాయితీగా తన తప్పును తాను సరిదిద్దుకొంటున్నాడంటారు. నిజాయితీగా వ్యవహరించే వ్యక్తిని "నిజాయితీపరుడు" అంటారు.
నిజాయితీ కల వ్యక్తులు ధర్మబద్ధంగా జీవననాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తమ ఆకాంక్షలు, అభిప్రాయాలు, ఆలోచనలను సూటిగా, నిష్కల్మషంగాను వ్యక్తం చేస్తూ తదనుగుణంగా నిబద్ధత తో ప్రవర్తిస్తారు.అటువంటి నిజాయితీ విలువ తెలిపే కథ చెపుతాను...
గుంటూరు నగరంలోని వ్యాపారి రాఘవయ్యకు తనవ్యాపార విషయాలు చూసుకునేందుకు నమ్మకమై ఉద్యోగి అవసరం అయ్యాడు. ఆ ఉద్యోగం కొరకు వచ్చినవారందరిని పరిక్షింపగా,చివరికి శివయ,శంకరయ్య అనే ఇద్దరు యువకులు మిగిలారు.ఆ ఇద్దరు యువకులకు మట్టినింపిన కుండీలు చెరి ఒకటి ఇచ్చి'నాయనలారా ఇవిగో కాకర గింజలు వీటిని చెరొకటి తీసుకొండి, ఈమట్టి కుండీలోనాటి ప్రతిదినం నీరు పోస్తూ గమనించండి. నేడు పౌర్ణమి వచ్చే పౌర్ణమినాటికి మొలక్కెత్తిన మోక్క తీసుకునిరండి' అన్నాడు రాఘవయ్య.
మరలా పౌర్ణమినాటికి ఇరువురి యువకులు రాఘవయ్యగారిని చూడటానికి వచ్చారు.శివయ్య తెచ్చిన పాత్రలొ చిక్కుడు గింజ మెలకెత్తలేదు.శంకరయ్య తెచ్చిన పాత్రలొ చిక్కుడుగింజ మొలకెత్తి ఉంది."శివయ్య నీకు ఇచ్చిన మట్టి పాత్రలొని చిక్కుడు గింజ సరిగ్గా గమనించలేక పోయావు అందుకే అది మొలకెత్తలేదు''అన్నాడు రాఘవయ్యగారు.
''అయ్యా నేను ప్రతిదినం నీరు పోస్తూనేఉన్నా,పైగా గాలి,వెలుతురు తగిలేలా ఉంచి బాగా గమనించాను.నా తప్పు ఏమిలేదు,బహుసా మీరు నాకు ఇచ్చిన కాకర గింజలో ఏదైనా లోపంఉండవచ్చు''అన్నాడు శివయ్య.
పక్కున నవ్విన రాఘవయ్యగారు ''నాయన లారా మీ ఇద్దరికి ఇచ్చిన కాకరగింజలను కావాలని, వేయించి(వేడిచేసి) నవి,మీకు ఇచ్చాను,అవి మెలకెత్తవు.ఆవిషయంనీవు కొంత గ్రహించగలిగావు,
శంకరయ్య కాకరగింజ మొలకెత్తుతుందేమో అని, కొద్దిరోజులు చూసి వేరే కాకరగింజ నాటి మెలకెత్తించాడు. నువ్వుమాత్రంనిజాయితీగా ఎటువంటి మార్పులు చేయకుండా పాత్రను తీసుకువచ్చావు.నీ నిజాయితీ మెచ్చదగినిది. శంకరయ్యా నిజంచెప్పు నువ్వు కాకరగింజను మార్చావు కదూ 'అన్నాడు రాఘవయ్య.
అవును అన్నట్లు తలఊపుతూ తనతప్పు అంగీకరించి వెళ్లిపోయాడు శంకరయ్య.
'శివయ్య నీనిజాయితి మెచ్చదగినది, నీలాంటి యువకులే దేశానికి వెన్నుముక. నేడే ఉద్యోగంలొ చేరు,ఇవిగో తాళాలు నేటినుండి నావ్యాపార లావాదేవీలు అన్ని నీవే నిర్వహించాలి'అన్నాడు రాఘవయ్య.వినయంగా చేతులుజోడించాడు శివయ్య.
బాలలు నిజాయితీ ఎంతగొప్పదో ఈకథద్వారా తెలుసుకున్నారుకదా! మీజీవితంలో ఎన్నడు తప్పుడుమాటలకు,తప్పుడు చేస్టలకు స్ధానంకలిగించకండి' అన్నాడుతాతయ్య.
బుద్దిగా తలఊపారు అరుగుపై ఉన్న పిల్లలంతా.

కామెంట్‌లు