మరపురాని అందమైన చిత్రాలకు ప్రాణం పోసి
మా అందరి హృదయాలను రంజింపచేసి
బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకుని
అమ్మ వేసిన ముగ్గులతో ప్రేరణ చెంది
ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం లెక్కచేయక వదలి
నమ్ముకున్న చిత్రకళకే ప్రాధాన్యత నిచ్చి
ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి వంటి అనేక పత్రికలలో పనిచేసిన
నీ ప్రతిభను గుర్తించి
సాహితీమూర్తి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారిచే
మేడిశెట్టి శంకరరావు నుంచి
' బాలి' గా మారి
ఇంతితై వటుడింతై అన్నట్లు చిత్రకారునిగా
అనకాపల్లి నుంచి అందనంత ఎత్తుకు ఎదిగి
దేశ విదేశాలలో మీరు గీసిన చిత్ర ప్రదర్శనవలన
అసాధారణ ప్రజాభిమానాన్ని పొందిన బాలి మీరు అందరిని వదలి అందని తీరాలకు
వెళ్ళడం మరువలలేకున్నా
ఎప్పుడు ఎలా ఉన్నారని అడిగే మీచే రెండు పర్యాయాలు నేను సత్కరింపబడటం
నా జీవితాన మరువలేనిది
మీరు ఇక లేరని తెలిసిన క్షణం నేను ఊహించలేను
మీరు సదా స్మరణీయులు
మీకివే నా అక్షర నివాళి...!!
(చిత్రకారులు, రచయిత బాలి నాకు గురుతుల్యులు
భాధతప్త హృదయంతో వారికి నా అక్షర నివాళి)
..............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి