ఎంత చెట్టుకు అంతగాలి !.; - డా. బెల్లంకొండనాగేశ్వరరావు.
 ముగ్గురు పండితులు గుర్రలపై ప్రయాణంచేస్తూ అవంతి రాజ్య పొలిమేరలలోని అడవిలో ప్రవేసించారు.తమవెంటతెచ్చుకున్న మంచినీరు అయిపోవడంతో ఆపరిసరాలలో నీటిజాడకై గాలించసాగారు. వారికి కొంతదూరంలో ఇరువురు పసువులకాపరులను చూసి
" యువకులరా మేము బాటసారులం చాలాదాహంగాఉంది ఇక్కడ ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయా ? "అన్నాడు పండితులలో ఒకరు.
" స్వామి ఇక్కడ దరిదాపుల్లో ఎక్కడా నీరు లభించదు తమకు అభ్యంతరం లేకుంటే నావద్ద మంచినీరు ఉంది తాగవచ్చు "అన్నాడు ఒక పసువుల కాపరి ."నీవుఇచ్చిన నీరుతాగలేము. మేము గొప్ప పండితులం   మావంటివారితో పాండిత్యంలో పోటీకి మీదేశంలోనే లేరు "అన్నాడు గర్వంగా మూడోపండితుడు.
"ఎట్లా మీరు విద్యావంతులు,గోప్పవారా? సరే మీఅంత చదువులేని పసువులకారి తమ ముగ్గురికి మూడు ప్రశ్నలు వేస్తాను వాటికి సమాధానం చెపితే తమగొప్పతనాన్ని అంగీకరిస్తాం "అన్నాడు ఒకపసువులకాపరి. "వెర్రివాడా మాకాలి గండపేరండాలు,చేతికి ఉన్న కంకణాలు చూస్తేతెలియడంలేదా? మేము ఎంతటివారలమో "అన్నాడు మెదటి పండితుడు. "కొండవంటి మాతో పొట్టేలువంటిమీరు ఢీకొంటే ఏమౌతుందో మీకుతెలియదా? "అన్నాడు రెండో పండితుడు. "వీరి ముచ్చట మనమెందుకు కాదానాలి,అడగవయ్య నీమూడు ప్రశ్నలు "అన్నాడు మూడవపండితుడు. 
" స్వామి  పండినా భోజనంలో తింటూ కాయఅంటాము ఏమిటది? అన్నాడు మెదట పండితునితో."స్వామి కాయగాఉన్నా ఫలంగానే పిలుస్తాం ఏమిటది? "అన్నాడు రెండోపండితునితో. "కాయనుండి పుట్టిన పువ్వు ఏది? "అన్నాడు మూడవ పండితునితో  పసువులకాపరి.
" పిచ్చివాడ కాయేకదా పక్వానికివచ్చి పండుతుంది. మరి పండు కాయఎలా అవుతుంది "కోపంగా అన్నాడు మోదటి పండితుడు.
మిగిలిన ఇరువురు పండితులు మౌనంవహించారు.
" ప్రశ్నకు ప్రశ్న సమాధానంకాదు. సమాధానం నేనే చెపుతాను  నిమ్మపండు ,పండుగాఉండి భోజన సమయంలో మనకు అది ఊరగాయగా మారుతుంది, రెండోప్రశ్నకు సమాధానం సీతాఫలం.అది పండకుండా ఉన్నప్పటికి దాన్ని మనం ఫలం అనేపిలుస్తాం. మూడవప్రశ్నకు సమాథానం  టెంకాయలోని పువ్వు .టెంకాయగాపుట్టే దానిలోపల పువ్వు ఏర్పడుతుంది. ఈచిన్నవిషయాలకు పాండిత్యం అవసరంలేదు.విద్యవలన వివేకం,వినయం పెరగాలి, కాని తమకు అహంకారంపెరిగింది.పండ్లభారంతో చెట్టు ఎంతవినయంగా తలవంచి నిలబడుతుందోకదా!. ఎంతచెట్టుకు అంతగాలి అన్నారు పెద్దలు.తమరు విద్యావంతులే తమరినీ నేను ఎంతగౌరవించి తమదాహర్తినీ తీర్చడానికి మంచినీళ్ళివ్వబోయాను ,కాని తమరు మమ్మల్ని చులకనగా మాట్లాడారు. ఈసంస్కారం తమరు ఏగురువు వద్దనేర్చారు? మీఅంత చదువులు చదవకుండానే మాగురువులు విద్యాతో వినయ,విధేయత,అణుకువ, సంస్కారం వంటి పలుఉత్తమలక్షణాలునేర్పారు. పెద్దలు విద్యావతులు విద్యతో అహంకారం పెరగటం శోచనీయం.మనిషి గర్వమే అతనిపతనానికి తొలిమెట్టు అని తెలుసుకొండి. "అనిచేతులు జోడించాడు పసువులకాపరి . "నిజమే విద్వత్ ఎవరిసొంతముకాదు, వినయ,విధేయతలు,సాటివారిఎడల గౌరవంగా మసలుకోవడం కనీసధర్మం. ఆవిషయం ఇక్కడ అనుభవపూర్వకంగాతెలుసుకున్నాం ,నాయని ఆమంచినీళ్ళు అందివ్వు "అన్నాడు పండింతుడు.కామెంట్‌లు