సుప్రభాత కవిత ; -బృంద
నింగి కొలనులో 
సువర్ణ కమలం 
వికసించబోతున్నది.

నిన్నటి  సమస్యలకు
జవాబు తెస్తుందా?

తగిలిన గాయానికి
మందు పూస్తుందా?

తలపుల సమరంలో
విజయం వైపు తోడొస్తుందా?

తరగని ఆరాటానికి
ఆహ్లాదమిస్తుందా?

అగని పోరాటానికి
ముగింపు తెస్తుందా?

విన్నవించు విన్నపాలు
ఆలకిస్తుందా?

నవ్వడం మరచిన పెదవికి 
నవ్వులు పూయిస్తుందా?

కురిసే కనిపించని  కన్నీటికి  
మెరిసేలా వెన్నెలవెలుగొస్తుందా?

కనకపు సిగపువ్వులా
గగనంలో వెలిగే పరమాత్మ
తెచ్చే సమాధానాల ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు