నదీ స్నాన ప్రయోజనాలు.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 1. నదీ స్నానం వల్ల శరీరంపై కనిపించే మాలిన్యం పోతుంది.
2. నిండుగా ప్రవహించే నదుల్లో స్నానం చేయడం వల్ల శరీరానికి అంతటికి సుఖ స్పర్శ కలిగి, శరీరంలో ఉష్ణాధిక్యత తగ్గుతుంది.
3. నదీ జలములోని చల్లదనం ఇంద్రియాల తాపాన్ని తగ్గించి, మనసుకు, వాక్కుకు సుచిత్వాన్ని కలిగిస్తుంది. కర్మలను చక్కగా అనుష్టించడానికి తోడ్పడుతుంది. పుణ్య నది తీర్థాల్లో చేసే స్నానం మనసుకు ఏకాగ్రతను ఇస్తుంది.
5., పుణ్య నదీ తీర్థాల్లో స్నానం చేసిన వాడు-తన సమాజంలో విశిష్ట వ్యక్తిగా గౌరవించబడతాడు.
6. మహర్షుల దీక్ష, తపస్సుల శక్తి నదీ జలాల్లో ఉన్నాయి కనుక-ఆ నీళ్లలో స్నానం చేయడం వల్ల ఆ శక్తుల్ని మనము గ్రహించిన వాళ్ళం అవుతాము.
7. కార్తీక, మాఘ మాసాల్లో నదీ స్నానం చాలా శ్రేష్టం! ఆ కాలంలో నదుల్లో దివ్య శక్తులు విశేషంగా ఉంటాయి.
8. శరీర శుద్ధి యే కాక-అంతఃకరణ శుద్ధి కూడా అవుతుంది.

కామెంట్‌లు