నది స్నాన ప్రయోజనాలు.;-తాటి కోల పద్మావతి గుంటూరు

 గంగా, సరస్వతి, యమున, గోదావరి మొదలైన పుణ్య నదులు-అవి ప్రవహించేంత దూరమూ పవిత్రమైనదే! కనుక ఎక్కడ స్నానం చేసినా పుణ్యం లభిస్తుంది.
10. ప్రతి జీవనదికీ 12 సంవత్సరాలకు ఒక మారు పుష్కరాలు వస్తాయి. జీవన ప్రదాతలైన నదులకు కృతజ్ఞత చెప్పడం పుష్కరాల ముఖ్య ఉద్దేశం. అక్కడ స్నానాలు చేసి, తాము ధన్యులై, తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేసి, పితృ రుణాన్ని తీర్చుకోవడం ధార్మిక ప్రయోజనం.
ప్రతి నదీ పాపాల్ని పోగొట్టి, పుణ్యాన్ని ప్రసాదించేదే!"నదీ"శబ్దం స్త్రీ లింగం కనుక నదిని స్త్రీ దేవతగా భావించారు-భారతీయులు. అందుకే స్త్రీలు నదులను కుంకుమ, పసుపు, పూలు మొదలగు మంగళ ద్రవ్యాలతో విశేషంగా పూజిస్తారు.
పుష్కర కాలంలో నదీ స్నానం-సామాన్య కాలంలో కంటే కోటిరెట్లు పుణ్యఫలాన్ని ఇస్తుంది.
గంగాజలంలో ఒక ప్రత్యేక గుణం ఉంది. అందలి నీళ్లు ఎంత కాలం పాత్రలో ఉంచినా -పాచి పట్టవు. క్రిములు చేరవు. ఈ స్వచ్ఛత గుణం ఇంతవరకు ఏ శాస్త్రవేత్తలకు తెలియని తత్వం.

కామెంట్‌లు