శతకంఠుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

రాముడు అయోధ్యను పాలిస్తున్న కాలంలో  అగస్త్యుడు వచ్చి "రామా! మాయానగరంలో శతకంఠుడి ఆగడాలు పెచ్చుపెరుగుతున్నాయి.కర్దముని కొడుకు. వాడిని సంహరించు"అన్నాడు.హనుమ తన శరీరాన్ని పెంచాడు.సీత లక్ష్మణ భరతశత్రుఘ్నులతో రాముడు యుద్ధానికి బైలుదేరాడు.శివపూజకై బైలుదేరుతున్న శతకంఠుడి పరాక్రమం కి రాముడు కూడా ఒకదశలో తట్టుకోలేక పోయాడు. రాముడి ఎదురుగా ఎంతోమంది శతకంఠులు కన్పడసాగారు.ఇక లాభంలేదు అని సీతాదేవి వాడిపై బాణంవేయటం ఆలస్యం వాడు నేలకూలాడు.కైకేయి దశరధునికి యుద్ధం లో తోడ్పడింది. ఇక్కడ సీతాదేవి శతకంఠుడిని చంపింది అని కొన్ని రామాయణాల్లో రాయబడింది. సత్యభామ నరకాసురుని చంపింది అని ఉంది. ఆనాటి నుండి నేడు ఆధునిక భారతీయ యువతులు పోలీసులు సైన్యాధికారులు పైలెట్స్ గా గణుతికెక్కటం ముదావహంకదూ🌷 
కామెంట్‌లు