అమ్మ అనిన అందం;- -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
అమ్మ అనే  మాటను
పలుకుదాం ప్రేమగా!!
అందులోని అమృతం
జుర్రుదాం  తృప్తిగా!!

అమ్మ పదం అద్భుతం
ఆకాశం  సాక్షిగా!!
ఆ రెండు అక్షరాలు
అపురూపం చూడగా!!

అమ్మ అనిన అందం
మమ్మీ శవమేగా!!
 తెలుగనిన ఆనందం
వెలుగిక  తెలుగేగా!!

మనసారగ పలకరా!
అమ్మ అని హాయిగా!!
తెలుగు భాష గొప్పరా!
ఉంటుంది నీడగా!!


కామెంట్‌లు