కందుకూరి వీరేశలింగం ;-:-పి.చైతన్య భారతి
కలం, గళం ఎత్తినాడు 
చైతన్యం నింపినాడు 
వీరేశలింగం పంతులు 
రచనలతో కడిగినాడు!

మూఢనమ్మకాలపైన
బాల్యవివాహాలపైన
నిరుపమాన కృషిచేసిన 
వైతాళికుడు కలియుగాన!

వితంతువుల వివాహాలు 
స్త్రీలందరికీ చదువులు 
ఆవశ్యకమని తలచి 
చేపట్టెను అహర్నిశలు!

చరిత్రను మలుపుతిప్పిన 
చీకటి తెరలను చీల్చిన 
అభినవ భాస్కరుడు 
కందుకూరే ఇలలోన!

పాతరోత భావాలను 
కాలం చెల్లిన కథలను 
ఆలోచన కరవాలం 
ముక్కలుగా నరికెతాను!

సమాజాన పోకడలను 
వ్యవహార ధోరణులను 
అక్షరమై ఎక్కుపెట్టె 
భావజాల చీకట్లను!

దురాచారాల మధ్యలొ 
నలుగేవారి  బతుకులలొ
సంస్కరణ కిరణాలను 
ప్రసరించెను సమాజంలొ!

చదువు బీజాలు నాటెను 
స్త్రీ విద్యకు ఉద్యమించెను 
పత్రికలను స్థాపించి 
పాఠశాలలే పెట్టెను!

తెలుగుప్రజల బతుకులను 
సమూలంగా మార్చేను 
ఇంటింటికి చదువులతో 
పడతి ప్రగతి చూపించెను!

కామెంట్‌లు