శంకర జయంతి ; - కోరాడ నరసింహా రావు.

 "భజగోవిందం-భజగోవిందం 
 గోవిన్దంభజ మూఢమతే... !"
 అంటూ... ఆది శంకరా చార్యులవారు ప్రవచించిన తత్వ సారాన్ని, వంటబట్టించుకున్న వారెందరు !?
         ఆహా... ఓహో... అంతగొప్పవారు, ఇంతవొప్పవారు... ఎంతగొప్పవారు.. అంటూ ఆయన చిత్రపటానికే కాదు రాముడు, కృష్ణుడు లాంటి మహాపురుషులందరికీ  పూలమాలలు వేసి ఓ మొక్కు మ్రొక్కేసి చేతులు దులుపుకునేవారే అందరూ !!
     ఒక్క శ్లోకం.... కేవలం ఒక్క శ్లోకం తో... ఈ మానవ ప్రపంచ శోకాలను దీర్చుకునే మార్గాన్ని చూపారే..., ఆ ఒక్కశ్లోకాన్నీ వంటబట్టించుకుని, శ్రద్ధతో ఆచరిస్తే... ప్రతి ఒక్కరూ ఈ మానవ జన్మను తరించిపోరా  !
 " సత్ సంగత్వే నిస్సంగత్వం 
 నిస్సంగ త్వే  నిర్మోహత్వం..., 
  నిర్మోహత్వే నిశ్చల తత్త్వం.... 
  నిశ్చల తత్వే  జీవన్ ముక్తి:"
   మంచితోనూ, మంచి మనుషులతోనూ కలవటం వలన ఈ సంఘం తో కలయిక అనేది ఉండక పోవటమేమిటి !? 
     మహాత్ములు ప్రవచించిన వాక్యాలను శ్రద్ధతో అధ్యయనం చెయ్యాలి... !
         అక్కడ సంఘముతో కలయిక ఉండకపోవటమంటే..    అనేక మొహాలను, ద్వేషాలను పుట్టించే ఈ సమాజంతో, ఈ సమాజంలోని చెడుతో... ఆ సత్సంఘం మూలంగా, ఈ దుస్సంఘమ్తో,ఆ చెడుతో ఇక  కలయిక ఉండదు... !
, ఆ విధం గా నిస్సంగములో  ఇంక ఎటువంటి మొహాలకూ తావుండదు... !
   మనలో ఈ సంఘం పట్ల ఎప్పుడైతే నిర్మోహత్వం ఏర్పడుతుందో... నీవు నిశ్చల తత్వ యోగివే అయిపోతావ్ !
అంటే  తత్ -  త్వం = తత్త్వం .. ఆ పరమాత్మయే నీవుగా మారిపోతావ్... !...
   అలా మారిపోగలిగినపుడు ఇక జీవన్ముక్తులమే కదా... !
...ఈ సంసారిక, సాంఘిక బందాలనన్నింటినీ ఇలా త్రెంచు కో గలిగితే... బ్రతికి ఉండగానే 
ముక్తులై మోక్షాన్ని పొందుతారు !
   అందుకే మనం సత్ సంగుల ము కావాలి... అలా ఐనపుడే... ఆది శంకరులవారు చూపించిన ముక్తి మార్గం లో 
పయనించి మోక్ష గాము  లము కాగలుగు తాము.... !!
.       *****

కామెంట్‌లు