ఓ శ్రీ శ్రీ..... అందుకో..... !--...కోరాడ నరసింహా రావు.

 లలిత హృదయ భావాలను మదిలోనే దాచుకుని.... 
   అక్షరాయుధాలను ఉద్యమాలకందించి, 
     నిర్వీర్య.... జన నిస్తేజo  లో చైతన్యం రగిలించి....  
 గేయమై గాండ్రించి, గీతమై గర్జించి... అవినీతికి దడ పుట్టించిన, నీ కవనం అజరామరం... !
    నీ జన్మమె ధన్యం... !!
ఓ ఆదర్శమూర్తి..... నీవు 
   మా కందరకూ  స్ఫూర్తి..... 
    ఓ శ్రీ శ్రీ మహా కవీ..... !
నీకిదె... మా అందరి వందనం !
      ******
కామెంట్‌లు