ఇసుక ఇల్లు !;-- కోరాడ నరసింహా రావు
అమ్మ - నాన్న  తో  కలిసి 
  అక్క - తమ్ము లిద్దరూ 
  ఆదివారంనాడు... 
.   బీచుకెళ్ళారు....... !

 ఆడవారు - మగవారు 
 పిల్లలు - పెద్దలు 
  తేడాలే లేక... కెరటాలతొ 
 అందరూ ఆదుకున్నారు.. !

 కాల్చిన జొన్న పొత్తులు 
  పిడతకింద పప్పులు 
  పుల్లైసులు కొనుక్కుని 
  ఆనందించారు.... !

 బాబు - పాప, ఇద్దరూ 
 తడిఇసుకన కాళ్లు పెట్టి 
 అందముగా... 
  ఇసుక ఇల్లు కట్టుకున్నారు !

నా ఇల్లే గొప్పంటే.... 
 నా ఇల్లే గొప్పంటూ 
 అక్క - తమ్ము లిద్దరూ 
 తగవు లాడారు... !

నిజం చెప్పమని 
  అమ్మ - నాన్న  నడిగారు !
 ఏవీ మీ ఇల్లంటే.... 
 అవిగో అని చూపించగ 
 అంతలోనె ఓ పేద్ద 
. కెరటామొచ్చింది.... 
 కట్టిన ఇళ్లను అది 
   ఈడ్చుకెళ్లింది.... 
 అయ్యో.... అంటూ.... 
 అందరు నవ్వుకున్నారు !!
      ******

కామెంట్‌లు