ఆడాళ్లు జోహార్లు! అచ్యుతుని రాజ్యశ్రీ
 పరీక్షల ఆఖరి రోజు. బ్రహ్మాండంగా రాసి క్లాస్ లో పాటలు పాడుతుంటే టీచర్లంతా నవ్వుతున్నారు.శివా అందుకున్నాడు "ఆడాళ్లు!మీకు జోహార్లు!" అంటూ.హెచ్.ఎం.అభినందిస్తూ ఇలాఅంది" నేడు ఆడపిల్లలు అన్నిటా పోటీ! ఇద్దరు యువతులను గూర్చి చెప్తా వినండి. జమ్మూ కాశ్మీర్ కి చెందిన 23ఏళ్ళ మావ్యా సూదన్ తొలి ఫైటర్ పైలట్ల లో ఒకరు.మొత్తం  12మంది  ఎన్నికైనారు.హైదరాబాద్  దిండిగల్ వాయుసేన ఎకాడమీలో పాసింగ్ ఔట్ పెరేడ్ లో పాల్గొన్న ఏకైక యువతి.రాజౌరీ గ్రామంకి చెందిన ఈమె చండీగడ్ డి.ఎ.వి.లో పొలిటికల్ సైన్స్ లో గ్రాడ్యుయేట్. "దేశం మొత్తానికి బిడ్డ మా కూతురు " అంటారు ఆమె అమ్మా నాన్న లు  సుష్మా  వినోద్ సూదన్!
అంకితా కుమావత్  అమెరికాలో ఉద్యోగం మానేసి తండ్రి పిలుపుతో వ్యవసాయం పాడిపరిశ్రమలో కాలు మోపింది.ఐ.ఐ.ఎం.లో చదివి 5ఏళ్ళు  జర్మనీ యు.ఎస్. లో చేసింది. ఆమెతండ్రి కూడా ఇంజనీర్. యు.ఎస్. లో జాబ్ మానేసి భారత్ లో వ్యవసాయం చేపట్టాడు.జాండీస్ రావటంతో అంకిత ఆర్గానిక్ ఫుడ్ పై దృష్టి పెట్టింది.50కి పైగా ఆవుల పోషణ సేంద్రియ వ్యవసాయం చేస్తూ  రెండు డజన్ల పైగా  రకరకాల వస్తువులు అమ్ముతుంది.100మందికి ఉపాధి కలిపిస్తూ  ఆన్లైన్ వ్యాపారం చేస్తోంది. " అంతే హెచ్. ఎం.మాటలతో పిల్లలు ఆలోచన లో  పడ్డారు. మన దేశంలో ఉండే స్వయం ఉపాధి తో బతుకు బంగారంగా మార్చుకోవడం మంచిది అని అనుకున్నారు🌹

కామెంట్‌లు