"అది స్వాతి చినుకే ఐనా..!";- కోరాడ నరసింహా రావు
  అది స్వాతిచినుకే ఐనా.... 
    ముత్యపు చిప్పలో పడితేనే 
    ముత్యమై మెరిసేది... !
  మనిషి పుట్టుక, పెరుగుదల... 
   మంచికుటుంబంలో... 
     ఉత్తమమైన పరిసరాలు... 
       పరిచయాల మధ్యఉంటేనే
    సత్సంస్కారాలబ్బెది... !
   అప్పుడుమాత్రమే... మనిషి 
  ముత్యంలా మెరవగలిగేది !
 
చకోర పక్షి  అందుకే.... ఆ
  స్వాతిచినుకును... యే 
   చెరువులోనో... ఏటి లోనో 
    పడకముందే... నోరుచాచి 
      అందుకుని, ఆస్వాదిస్తుంది 
అది స్వాతి చినుకే ఐనా... ముత్యపు చిప్పలోకాక... 
    ఏ రాతిమీదో, ఇసుకలోనో 
    పడితే... ఇగిరి ఆవిరైపోతుంది కదా.... !
   మనిషైనా... అంతే.. !!
 పడవలసిన చోటకాక... 
   కూడనిచోట పుడితే... 
   ఆమనిషి పరిస్థితి అంతే !!
       *****

కామెంట్‌లు