పుష్కరం:-వృత్తాంతం;- తాటి కోల పద్మావతి గుంటూరు

 ఆ సమయంలో సకల దేవతలతో కూడా బ్రహ్మ పుష్కరినితో ఉండాలి. మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధిపతి అయినా పుష్కరుడు ఈ నియమాన్ని అనుసరించి, బ్రహ్మాది దేవతలతో, బృహస్పతి తో కలసి, ఏ నదికి పుష్కరం వస్తుందో ఆ నదిలో నివసిస్తాడు. ఆ కాలం ఆ నదికి మహా పుణ్యకాలం! దేవతలందరూ ఆ సమయంలో ఆ నదిలో ఉండడం వల్ల దాని ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతుంది. పుష్కర కాలంలో ఆ నదిలో స్నానం చేసి, తీరంలో తర్పణం , శ్రాద్ధం మొదలైన కర్మలు ఆచరించడం వల్ల గొప్ప ఫలితం లభిస్తుంది. పుష్కర కాలంలో ఆ నదీతీరంలో చేసే తర్పణ శ్రాద్ధతులవల్ల పితృదేవతలకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. వంశాభివృద్ధి కలుగుతుంది. దేశం సస్యశ్యామలమై సుభిక్షంగా ఉంటుంది. సమాజం శాంతి సౌభాగ్యాలతో ఆనందంగా ఉంటుంది.
పుష్కర నదులలో చేసే ఏ పవిత్ర కార్యమైనా తక్షణమే సత్ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. పుష్కర స్నానం తాపాలను, పాపాలను పోగొడుతుంది. సమస్త శుభాలు ప్రసాదిస్తుంది. 1000 గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది.
పుష్కర కాలం లో ప్రాతఃకాల స్నానం ఉత్తమం. మధ్యాహ్నం స్నానం మాధ్యమం. సాయంకాల స్నానం సామాన్యం.
పుష్కర స్నాన మహిమతో పునీతులం అవుతాం.

కామెంట్‌లు