తరుశాఖల హరితమ్మే....;- కిలపర్తి దాలినాయుడు
నరుకబోకు అడవులను
నరకానికిపోతావు!
నాటుకుపోవోయ్ మొక్కలు
నందనవనమౌ తావు!

పసందైన సంద్రాలను
ప్లాస్టిక్కు వదులబోదు!
పసిడి ముద్దవంటినేల
పొరల్లోన కరిగిపోదు!

జనగణముల శ్వాసలాగు
జలజీవుల చలనమాగు
మారణహోమము జేయును
కనిపించని కాలుష్యం!

ఐశ్వర్యంగల దేశా
లాపుకోవు పొగమంటను!
పేదసాద దేశాలవి
ఆపలేవు సెగ మంటను!

ఐక్యరాజ్య సమితిమాట
పట్టదుగద పాలకులకు!
శాస్త్రవేత్త హితబోధలు
చెవిక్కెవు నాయకులకు!

భూతాపం పెరుగుతున్న
బుర్రక్కెదే శాస్త్రం!
తరుశాఖలహరితమ్మే!
కాలుష్యానికి శస్త్రం!
----------------------------------


కామెంట్‌లు