ప్రబోధగీతం :-నీవనుభవించు. !;- కోరాడ నరసింహా రావు !

 పల్లవి :-
    నీ వనుభవించు ఆ సుఖ - దుఃఖములు నీ ప్రారబ్ధములని ఎఱుగుమురా..., 
  నీ తల రాతను ఏ బ్రహ్మ్, రాసాడని నువ్ తలచకురా... !
        " నీవనుభవించు.... "
చరణం :-
      కర్తవు నీవే... కర్మయు నీదే భోక్తవూనీవె నిజమిదిరా..., 
 నీ బాధలకు, వేరెవరినో నువ్ నిందించుట అన్యాయమురా !!
      "కర్తవు నీవే..... "
     " నీవనుభవించు.... "
చరణం :-
    రేపటి నీ తలరాతను ఇపుడు, మంచిగా  నువ్ రాసుకుంటే...బాధలనేవి లేకయె రేపు ఆనందముగా బ్రతకవచ్చురా.... !.....2
   పాపపు పనులు చేయకురా 
ఏ ఒక్కరినీ బాధించకురా... చేతనైన మంచినే చేసి పుణ్యమును మూట గట్టుమురా..... !....2
       " నీవనుభవించు.... "
     ********
కామెంట్‌లు