నేను.... నేను, నాది... నాది....
అంటూ... ఎందుకావృధా ప్రయాస.... !?
వచ్చిననాడేంతీసుకువచ్చావని
పోయినప్పుడేంమోసుకుపోతా
వని.... !!
నేను -, నేను అనుకుంటున్న
ఈ నేనే... నేను కానపుడు.. ఇక నాది అనేదేముంటుంది బ్రదర్!
నువ్వు,నేనుఅనుకుంటున్న
ఈ దేహం... నీ ఉపాధికోసం ఏ ర్పరచుకున్నఉపకరణాలసము
దాయము మాత్రమే.... !
కొంతకాలానికవన్నీ వేటికవిగా విశ్రమించాల్సినవే... !
అప్పుడిక ఈ నేను అను కుం టున్న నేనే లేనపుడు, ఇక్కడ నాది అనేదేముంటుంది బ్రదర్!
ఇదంతా... ఏ ఒక్కరిదీ కాని మాయాప్రపంచం !
ఇది నేడు ఒకలా... రేపటికి
మరొకలా... రోజు - రోజుకీ మా రిపోతూ...మాయమైపోతుంటుంది... !!
ఈ నేను కాని నేను... నాది
కానిదానికోసం... ఆరాటంతో...
ఎన్నో పోరాటాలు చేస్తున్నాను కదూ.... !
ఈ నేను, కాని నేనూ... మాయమై పోతుంది !
ఐతే.... పోయినా, నన్ను గురుంచి తరతరాలూ గొప్పగా చెప్పుకోవాలంటే... నాలుగు మంచిపనులు చెయ్యాలోయ్ !
మొట్టమొదట... నీవు
స్వార్ధాన్ని వీడి త్యాగిగా మారా లోయ్... !
అప్పుడే ద్వేషం నీ దరికి రాదు, నీలో ప్రేమ పల్లవిస్తుంది,
అందరూ నిన్ను ప్రేమిస్తారు !!
తదుపరి..., నీవు మర ణించి నిష్ప్రయోజనంగా మట్టి
పాలైపోయేకన్నా....,
నీ అవయవాలను దానం చేస్తా నని మాటివ్వు... !
అప్పుడు నీ కళ్ళు, నీ కిడ్నీలు
నీ అవయవాలు మరికొందరికి జీవితాన్నిస్తాయి... ! నీ ఈ జన్మ కు సార్ధక్యాన్ని చేకూరుస్తాయి!!
చరిత్రలో నీదొక పేజీ తర తరాలూ చదువుకునేలా చేస్తుంది !
నీ స్పూర్తితో.... ఎందరో... వాళ్ళ జన్మలనూ ధన్యం చేసు కుంటారు... !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి