శ్రీకృష్ణుడు;- కె.కె.తాయారు

 శ్రీ కృష్ణుడు.  కంసుడుని వధించినతరువాత ,ఆయన చెరశాలకు వెళ్ళి తల్లిదండ్రులు అయినట్టి దేవికి వసుదేవులను. విడిపించడానికి వెళ్ళారట.
                       అప్పుడు దేవకిమాత నాయనా కృష్ణా నన్ను  విడిపించడానికి 14 సంవత్సరాలు‌ పట్టింది ఎందుకు అని అడిగిందట.దానికి  కృష్ణుడు
అమ్మా, త్రేతాయుగంలో  నువ్వు నన్ను 14 సంవత్సరాలు అడవికి పంపావు కదమ్మా ‌అప్పడు
నేను రాముడిని.నువ్వు కైకేయి మాతవి అన్నాడుట.
           అయితే నిన్ను  కన్నతల్లి ఎక్కడ ఉందో చెప్పు
నాన్నా, అందిట.
         అమ్మా  ఆమె ఎవరో కాదమ్మా యశోదమ్మ.
ఆమెతో ఇప్పుడు నా బాల్యం, నాప్రేమ,అన్నీ  ఆమె తో పాటు నేనూ అనుభవిస్తున్నా !
అప్పుడు ఆమె నేను ఇద్దరం పోగొట్టు కున్నాం కదా.
అది ఇప్పుడు అనుభవించాము అని అన్నాడట.
                   అంచేత మనం ఎప్పుడూ మంచి పనులే చేస్తే ఆ ఫలం మనతో ఉండి మనల్ని కాపాడుతుంది..
                      శుభం.              
కామెంట్‌లు