బాబు జగ్జీవన్ రామ్(మణిపూసలు):-పి. చైతన్య భారతి*
భారత అమూల్య రత్నము 
బీహారు సింహస్వప్నము 
జగ్జీవన్ రామ్ గారిది 
ప్రజాస్వామ్య పోరాటము!

హరిత విప్లవ కారకుడు 
అన్నార్థుల సేవకుడు 
దళితపాలిటి బంధువు 
రాజీలేని యోధుడు!

తన ఆదర్శ విధానాలు 
అనుసరించిన మార్గాలు 
సాటిలేని ధీర చెరితె 
నేటి యువతకూ బాటలు!

సామాజిక న్యాయమునకు 
సత్యాగ్రహ పోరునకు 
అలుపులేని రణధీరుడు 
ఓటుహక్కూ సాధనకు!

తరతరాలే గడిచినను 
మరువలేము తనసేవను 
జయము జయము జగ్జీవన్ 
కొలిచెదమూ జననేతను!

జనం సేవలో దేవుడు 
జగ్జీవన్ మహనీయుడు 
జాతి ప్రజల జాగృతమే 
ఆశయంగ బతికినాడు!

అన్యాయాన్ని ప్రశ్నించి 
అగ్గిపిడుగై ఎదురించి 
మార్పులెన్నో తెచ్చెను 
దేశప్రగతి కాక్షించి!

పార్లమెంటు సభ్యుడిగా 
మంత్రి పదవే ఘనముగా 
జీవితమే తరించెను 
దళిత జనోద్ధరణ దైవంగా!

కామెంట్‌లు