భరతమాత గొప్పదనం(మణిపూసలు);--చైతన్య భారతి పోతుల-ZPHS కవాడిపల్లి, అబ్దుల్లాపూర్మెట్, 7013264464
శాంతి సహనమాస్థిగాను
జ్ఞానకాంతి సొత్తుగాను
కీర్తితోడ వెలిగెనులే
మనదేశం జగతిలోను

సకల కళల జననితాను
సహనశీలి పృథ్వి తాను
స్నేహానికి చిరునామాగ
విలసిల్లే అవనితాను

అరణ్యాల సొగసుజూడు
జనని గర్భ సిరులు జూడు
జలశోభల అద్భుతాల
భరతమాత సొగసు జూడు

మహనీయుల గన్నతల్లి
జ్ఞానసుధల కల్పవల్లి
ఇతిహాసపు మధువులతో
విలువలన్ని పంచె తల్లి

స్వచ్ఛమైన హిమనదాలు
సస్యములకు త్యాగసుధలు
ఆహ్లాదం వొనగూర్చే
ఆధ్యాత్మిక స్థావరాలు

మట్టికణం తాకగానె
పేరు మదిన తలవగానె
మనసంతా పులకించెను
మాతృభూమి సేవలోనె

కామెంట్‌లు