దానశీలి- బుడ్డా వేంగళ రెడ్డి (10);- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మిమ్మల్ని చూస్తుంటే బౌద్ధ భిక్షువులా ఉన్నారు మీరే అలా అంటున్నారేమిటి స్వామి విస్తుపాటుగా ప్రశ్నించడావ్యక్తి  నేను బౌద్ధ భిక్షువును అయినంత మాత్రాన వాస్తవం వమ్ము కాదు గా నాయన వాస్తవం ఎప్పుడు విడ్డూరంగానే ఉంటుంది  అనగానే  నా పేరు వేంగళ రెడ్డి అంటారు ఉయ్యాలవాడ గ్రామవాసిని. నాకు చిన్నప్పటినుంచి బుద్ధ భగవానుడు అన్నా అతని బోధలు నాకు చాలా ఇష్టం. వయస్సు పెరిగే కొద్ది ఆయన తత్వాన్ని తెలుసుకునేందుకు అనేక గ్రంథాలు చదివాను  అయినా నా ఆలోచనలు ఇద మిద్దం గానే ఉన్నాయి. ఓమారు ఇక్కడ బౌద్ధారామాన్ని చూడాలనిపించి వచ్చాను  మీరు అన్నీ తెలిసినవారు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అడగమంటారా  అంటే అడుగు నాయనా  అన్నాడు. స్వామీ మనిషి జీవితానికి పరమావధి ప్రయోజనం ఏమిటి  అంటే తెలుసుకోవాలని ఉందా నాయనా  అవును స్వామి  దయచేసి తెలియజేయండి  అనగానే సమాధానం నీ కళ్ళముందే ఉంది గ్రహించు నాయన ఆశ్చర్యంగా అడిగాడు రెడ్డి నా కళ్ళముందే ఉందా ఎక్కడ స్వామి  అనగానే పరిసరాలు గమనించి దానిని గ్రహించి చుట్టూ పరిసరాలు గమనించిన బుడ్డా వేంగళ రెడ్డి మనో దృష్టితో చివరికి ఎదురుగా ఉన్న చింతచెట్టు అగుపించింది. బౌద్ధ భిక్షువు ఆంతర్యం బోధపడింది స్వామి మీ ఆవిర్యలతో బోధపడింది  ఏ ఫలము ఆశించి చెట్టు నీడని ఇస్తుంది ఏ ఫలం ఆశించి మన శరీరం ఉన్నంత ఇతరుల ఉపయోగానికి ఉపయోగపడుతుంది  అర్థమయింది స్వామి
ఏ ఫలం ఆశించి తన శరీరాన్ని అంతా ఇతరుల ఉపయోగానికి వినియోగపడుతుంది  అర్థమైంది స్వామి మనిషి జీవితానికి పరమావధి మానవసేవే అని మానవసేవే మాధవ సేవని పెద్దలు ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు అవగతమయింది  అనగానే అవగాతం అవగానే సరికాదు ఆచరణలోకి తేవాలని ఆయన అంటే  తప్పక స్వామి ఇప్పటిదాకా మానవసేవ నది నా జీవితంలో ఓ భాగం మాత్రమే అనుకున్నాను కానీ ఇకనుంచి మానవసేవే నా జీవితంగా భావిస్తాను అందుకోసం నిరంతరం పరిశ్రమిస్తాను స్వామి  నాతో చివరి ప్రశ్న అనగానే  అడుగు నాయనా అన్నాడు బిక్షం  స్వామి ఇంతవరకు నాకు ఎవరూ సమాధానం చెప్పలేదు  ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటారు కదా  అంటే ఏమిటి నాకు వివరించండి అని వినయంగా అడిగాడు వేంగళరెడ్డి.

కామెంట్‌లు