భారతావని;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఎదురు చూస్తుంది ఈ భారతావని.....
పగవాడి దేశాన సైతం పట్టు విడువక దిమ్మ 
తిరిగే దైర్యాన్ని చూపిన ఆ ధీరుడి కోసం.....
తెగబడుతారని తెలిసిన
తడబడని తెగువ చూపిన ఆ వీరుడి కోసం.....
దేశ సరిహద్దున రాత్రీ పగలూ 
అన్నతేడా లేక శ్రమించిన శ్రామికుడి కోసం.....
భారతమత సంరక్షణ తన ప్రధమ 
కర్తవ్యంగా భావించి 
దేశసేవలందించే ఆ సేవకుడి కోసం....
మన దేశంలో అలజడులు
సృష్టించాలని రంకెలేస్తున్న రాక్షసులను 
రానివ్వక ఆపిన రధసారధి కోసం....
కాకీదుస్తులను ధరించి కొన్ని 
కోట్ల ప్రజల కోసం కష్టాన్ని 
ఇష్టంగా కొనసాగించే సైనికుడి కోసం....
పగవారి దేశమైన పాకిస్తాన్ అన్న 
పద్మవ్యూహన్ని ఛేదించి 
వస్తున్న అభిమాన్యుడి కోసం....
తనకు రక్షణ లేదని తెలిసిన రహస్యాలను 
జాడ విడువక పొరుగు దేశాన్ని సైతం 
ఆశ్చర్య పరిచిన అభినందన్ కోసం...
ఉగ్రమూకలను అంతమొందించే 
అలుపెరుగని పోరాటంలో పట్టుబడ్డావని 
తెలిసి కుంగింది ఈ ధరణి....
ఒంటరివై ఓడించి విజయుడివై 
తిరిగి వస్తున్న నీ కోసం, చిరునవ్వుల 
స్వాగతాన్ని పలుకుతూ ఎదురు చూస్తుంది
నీ ఈ భారతావని....కామెంట్‌లు