దానవులలో మానవుడు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 రాక్షస వంశంలో జన్మించిన  రావణాసురుడు  కామ ప్రవృత్తి ప్రధానంగా కలిగిన వాడైనా  సంప్రదాయాన్ని  నిలపడం కోసం  మిగిలిన వారికి మార్గదర్శకంగా  ఉండేలా  ప్రవర్తించారు  ఉదయం లేచిన తర్వాత మొదట తల్లిని కలిసి  ఆమె పాదాలకు నమస్కరించి  తాను ఆరోజు ఏ కార్యక్రమాలు చేయబోతున్నాడో ఆమెకు తెలియజేసి  ఆ తరువాత కార్యక్రమానికి ఉపక్రమించడం  అతని మనోప్రవృత్తిని తెలియజేస్తాయి  సాక్షాత్తు బ్రహ్మ కుమారుడు  వేదములన్ని ఆపోసనా పట్టిన వాడు  సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తికి మార్గదర్శక సూత్రాలను తెలియజేసిన వాడు  తన లంకా పట్టణంలో ఏ ఒక్కరికి  కష్టనష్టాలు లేకుండా తన పరిపాలన  అద్భుతంగా కొనసాగించినవాడు  శ్రీరామచంద్రమూర్తికి చెప్పిన  రాజనీతిని ఒక్కసారి చూద్దాం.
మంచి పనిని చేయడానికి వాయిదా వేయవద్దు అని చెప్పడానికి  తన నగరం చుట్టూ ఉప్పు సముద్రం ప్రవహిస్తూ ఉంది  దానిని పాలసముద్రం కానీ దధి సముద్రంగా కానీ మార్చడానికి  ప్రయత్నం చేశాడు కానీ ఎప్పటికప్పుడు తన కార్యక్రమాల ఒత్తిడిలో  తరువాత చేద్దాం అని  వాయిదా వేయడంతో  తన జీవితంలో చేయదలుచుకున్న మొదటి మంచి పనిని చేయలేకపోయాడు  తాను స్వర్గలోకానికి వెళ్ళేటప్పుడు  దోవలో  యమధర్మరాజు పాపులను ఎలా చిత్రహింసల పాలు చేస్తున్నాడో చూసి మనసు చలించి మానవులు తిన్నగా స్వర్గానికి వెళ్లడానికి భూలోకం నుంచి స్వర్గలోకానికి ఒక నిచ్చెన ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు  కానీ చేయలేకపోయాడు  సమయం కుదరక. ఇంక చివరిది చెడు అని నీ మనసు దానిని చేయడం వల్ల  తన జీవితానికి ముప్పు వచ్చిన సంఘటన  చెప్పాడు రామునికి రావణాసురుడు నా బావ సూర్పనఖ భర్త ఎవరో పరాయి స్త్రీని బలాత్కరిస్తూ ఉండగా చూసి నా మనసు  బాధకు లోనై బాణంతో బావను చంపాను  తర్వాత తెలిసింది అతను బావ అని  చెల్లికి మాట ఇచ్చాను  బాధపడి నీ సుఖాలను  మానుకోవద్దు  నీవు ఏ సుఖాన్ని  కోరినా దానిని నిరభ్యంతరంగా చెయ్  ఏదైనా అడ్డు ఉంటే నేను దానిని తొలగిస్తాను అన్నాను రామలక్ష్మణులు తనను  మోహించకపోవడానికి కారణం సీత తనకన్నా అందంగా ఉండడం  కనుక ఆ అడ్డును తొలగించమంటే సీతను మహా పతివ్రతను తీసుకుని వెళ్లి అశోకవనంలో కూర్చోబెట్టి  ఎలాంటి పాపపు ఆలోచనలు లేకుండా  తన తమ్ముడు విభిషణుని కూతురు త్రి జట ను ఆమెకు జతగా ఉంచాను కనుక మంచి వాళ్ళలో చెడ్డవాళ్ళు ఉంటారు చెడ్డవారిలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అది మీరు తెలుసుకోవడం కోసమే ఈ విషయాన్ని మీకు తెలియజేశాను. పిల్లలూ అర్థమయ్యిందిగా.


కామెంట్‌లు