*హనుమాన్ చాలీసా - చౌపాయి 7*
 *శ్రీ శోభకృత, వైశాఖ బహుళ దశమీ, ఆదివారం - 14.05.2023,  హనుమజ్జయంతి శుభాకాంక్షలతో*
*విద్యావాన గుణీ అతిచాతుర!*
*రామ కాజ కరివే కో ఆతుర!!*
తా: భీమాగ్రజా! వాయునందనా!! అన్ని శాస్త్రములు, విద్యలు నేర్చిన వాడివి. శుభములు ఇచ్చే అన్ని గుణములు కలిగి ఎంతో చతురత కూడా ఉన్నవాడివి. ఇన్ని గుణములు ఉన్న నీవు రామచంద్ర ప్రభువు ఇచ్చే పనిని పూర్తి చేయడానికి ప్రతీ క్షణము ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటావు.......అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం: మనమందరం కూడా మన గురువులు నేర్పిన చదువులు ఇచ్చిన తెలివి తేటలతో విర్రవీగకుండా, ఆజనేయుని లాగా, నిలువెత్తు అణకువను అలవరచుకుని, పెద్దల పట్ల గౌరవం, వినయం విధేయత చూపిస్తూ, వాళ్ళు మనకు అప్పచెప్పే పనిని సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఉత్సుకత చూపతూ సిద్దంగా ఉండాలి. ఇంతటి విద్యను, తెలివితేటలను, వినయ సంపదను, కార్యసాధన దక్షత, దీక్షత మనందరికీ అనుగ్రహించాలని.........ఆంజనేయుని తలపులలో నిత్యం కొలువున్న సీతా మనో వల్లభుని వేడుకుందాము.*
*ఆఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు