పదిపాయింట్ల పరిషాను(మణిపూసలు);- పి. చైతన్య భారతి, 7013264464
నాన్స్పవుజూ టీచరన్న 
ఆలోచన చేయుమన్న 
ఉన్నదొకటి నౌకరైన 
బాధ్యతలే మెండుఅన్న!

పిల్లజెల్ల సాకాలే 
ముసలోళ్ళను జూడాలే 
అప్పుజేసి ఇల్లుగొన్న 
కిస్తులన్ని గట్టాలే!

పదిపాయింట్ల దగాతో 
సీనియార్టి నష్టంతో 
మారుమూల కిసిరేసిరి 
మిగులున్న మాన్యాలతో!

కోడికూయ లేచితాను 
ఉలికిపడీ సర్దుకొనెను
చంటిపిల్ల నొదిలేసి
బస్సులకై పరుగెత్తెను!

బాధ్యతలో మునిగితాను 
ఒత్తిడితో ఉచితంగను 
రోగాలతొ కుమిలిపోయె  
ఒంటిచేతి నౌకరిగను !

ఉద్యోగులు ఇద్దరైన 
సంపాదన మెరుగైన 
పదిపాయింట్ల దగాతో 
ఎత్తులేయ మీకు తగున!

పట్నానికి దగ్గరుంటు 

హెచ్చార్యేలందుకుంటు 
విలాసాలు మీకేనా ?
అదనంగ పాయింట్లంటు!

ఒక్కటే నౌకరైనను 
ప్రశ్నించనీ గొంతుకను 
దంపతులం మేముకూడ
వివక్షయేల భరింతును!

మేలుకోండి మెరుపులాగ 
పోరాటమే సలుపంగ 
కదలిరండి మిత్రులార
అడగకుంటే మారదుగ!

బలహీనుల తొక్కేందుకు 
విలాసంగ బతికేందుకు 
అన్యాయపు పాయింట్లు 
వెసులుబాటు పొందేందుకు!

కామెంట్‌లు