ఆధ్యాత్మికం;- మమత ఐలకరీంనగర్9247593432
 ఉ.
ఎంతటి భాగ్యమో! నుదురునీశ్వర దర్శన మొందుచుంటినే
పొంతన బెట్టుచుండు మరి పోకిరిగా మది నిల్వదెచ్చటన్
చెంతమహేశ్వరున్నిగన చిత్తము దేనికొ చెంచలించునే
నింతటి జ్ఞానసాధనము నీశ్వరలీలలు గాంచధన్యమౌ

కామెంట్‌లు