వివేకం;- డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరుకడపజిల్లా9440703716.

  విశాలపురంలో ఉండే వివేకుడు ఒకసారి
పనిమీద బంధువుల ఇంటికి పట్నం బయల్దేరాడు. ప్రయాణసౌకర్యం లేకపోవటంతో దగ్గరిదారిన నడిచి
వెళ్తున్నాడు.దారిలో ఎదురుగా నలుగురు
మనుష్యులు నిల్చుని ఉండటం గమనించాడు.
'ప్రయాణికులైతే నడుస్తూరావాలి.అలా నిలబడి ఎందుకుంటారూ?'
అనుకున్నాడు.దొంగలేమో అని అనుమానం
వచ్చింది.వెళ్ళేది బంధువుల ఇంటికి కాబట్టి చేతికున్న ఉంగరం తీయకుండానే బయల్దేరాడు.వెంటనే ఓక్షణం ఆలోచించి టక్కున తన చేతికున్న విలువైన
ఉంగరం తీసి దవడన ఉంచుకున్నాడు.
దొంగలకు ఎదురుగా నడిచి వెళ్ళాడు.
దొంగలు అడ్డగించికత్తి చూపించి "నీ దగ్గరున్న డబ్బుతీసివ్వు"అన్నారు.
వివేకుడు ఏమాత్రం తొనకకుండా "బేబే...
బేబే"అన్నాడు.ఏమంటున్నారు?అని సైగలు
చేశాడు వివేకుడు.
"నీ దగ్గరున్న. డబ్బు తీసివ్వు" అన్నాడు ఓదొంగ బిగ్గరగా.
వివేకుడు ''బే..బే'' అంటూ తనకు వినపడదని సైగలు చేశాడు.
వీడెవడో మూగి,చెవిటి వాడిలా ఉన్నాడని
వాళ్ళు వాడి దుస్తుల్లో వెదికి దొరికిన కొద్ది
పాటి డబ్బు తీసుకుని పంపించారు.
పట్నం చేరేవరకూ ఉంగరాన్ని దవడనుంచి
బయటకు తీయలేదు వివేకుడు. జరిగింది చెబితే ఆపదలో నేర్పుగా ప్రవర్తించిన వివేకు
డిని బంధువులు,కుటుంబ సభ్యులు
అభినందించారు.

కామెంట్‌లు