పనితనం పిల్లలం; -గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
వేటాడే వయసున్న పిల్లలం
మాటాడే మనసున్న మల్లెలం
పనితనం పోషించిన వారలం
ఫలితాన్ని ఆశించిన పోరలం !

చెవుల పిల్లుల వేటంటే ఇష్టం
చేపల జెల్లల వేటంటే కష్టం
అమ్మి చేసుకుంటాం సొమ్ము
నమ్మి తీసుకుంటాను దమ్ము !

పని పాటలు లేకుండా  ఉండం
పని కల్పిస్తే పెడతాము దండం
ఫలితంగా పొందేము అవార్డు
ఫలవంతమౌతుంది మా రికార్డు!

పసి కూనలు వీరేం చేస్తారు పని
మీ మదిలో మీరే ఇక అనుకుని
మాకు పని ఇవ్వకుండా ఉండొద్దు
ఆ దారిలో అస్సలు మీరు నడవద్దు

మా పని కోసమే ఈ వలస బాట
మేం గాని వాసమే ఆపై ప్రతిపూట
ఇంతకన్నా కావాల్సింది ఏముంది
అని మామది మమ్ముల ప్రశ్నిస్తుంది

ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి మీరు
చెప్పకుండా  చేయకండి తకరారు
చెప్పితే ఇక మీరేగా మా నవాబు
తప్పితే మేము కాలేముగా షరాబు

మేం చెప్పేటి మాటలు వినుకోండి
ఆలోచించి పరిష్కారం కనుకోండి
అప్పుడు కలువునులే విజయం
మీకెప్పుడు కలగదు  అపజయం !

మేం  ఆటుపోటుల తట్టుకుంటూ
మా కష్టనష్టాలను నెట్టుకుంటూ
మీ పనిని చేస్తాం మేం పరిపూర్తి
మీరు అవుతారులే మా చక్రవర్తి!

పనిలోని విజయ రహస్యం ఇదే
కనుగొంటే ఈ పని కష్టం ఇక కాదే
ఇది తెలియకే పడతారంతా కష్టం
ఇక తెలిస్తే పని పైనే అందరికీ ఇష్టం


కామెంట్‌లు