మెరుపు ముత్యాలు;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.- సెల్.9491387977.- నాగర్ కర్నూల్ జిల్లా
మిల మిల మెరిసే ముత్యాలు
కళకళలాడే రత్నాలు
వెరిసి ముత్యాల హారాలు
ఇంటి ముంగిట అందాలు !

ఈ ముత్యాల కాంతుల
ఇష్టపడే ఇంతుల
సిగలో చేయమంతుల
తోని నిత్యం మిల మిల !

మంచి ముత్యాల హారాలు
అవి అందాల తీరాలు
చేర్చి ఇచ్చును వరాలు
ఇంకెందుకూ బేరాలు !

ముత్యాల హారాల కుప్ప
మన ఆనందాల తెప్ప
అని చెప్పితివి తిమ్మప్ప
భళా !నీవేలే గొప్ప !

ఇవి తళుకు లీనుతున్నవి
మేము మిన్న అంటున్నవి
మాకు సాటి లేరన్నవి
చాలెంజ్ చేస్తున్నవి !

దారం ఆధారంతో
మేలిమైన ముత్యాలతో
హారమై అందాలతో
చేరుతాయి అవి మనతో !

సోకైన మన ముత్యాలు
అనువైన ఘన  రత్నాలు
విరజిమ్మును అందాలు
పెనవేయును బంధాలు !

మైమరపించు రత్నాలు
మురిపిస్తున్న ముత్యాలు
వాటితో పాటు పగడాలు
ఉండవు ఇక  జగడాలు !

వీటి కుందిలే డిమాండు
అవి మీరిక తెలుసుకోండు
వారు రాసిస్తారు బాండు
ఎందుకు పంపేది దండు ?!

ముత్యాల హారాలంటే
రత్నాల రాసుల కంటే
మిన్న అని తెలుసుకుంటే
పండేదిక నీ పంటే !


కామెంట్‌లు