కాలమా ఆగుమా!;-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
నిన్ను వెన్నంటి ఉండే నీ నీడలా
నీ కంటికి కనిపించని నీ జాడలా
కాలం వెళ్తూనే ఉంది ముందుకు
కాలంతో పరిగిడక ఉన్నావెందుకు?

నీవు కాల గమనాన్ని పరీక్షించు
కలిసి వచ్చే కాలం కై నిరీక్షించు
కాలయాపన చేయక జయించు
కాలజ్ఞానివై గెలుపుకై తపించు !

కాలానికి కొలమానం ఉందా
కొలువబోతే అది జారుకుందా
అలాఐతే నీపని ఇక గోవిందా
ఎలాగైతేనేం తప్పదు అపనిందా!

కాలం కాలసర్పమై కరవచ్చు
ప్రాణ భీతితో నీవు వెరవచ్చు
జాగ్రత్తగా ఉంటే తప్పుకోవచ్చు
అజాగ్రత్త.ఐతేతప్పకముప్పొచ్చు

నీ ప్రాణాన్ని ఫనంగా నీవు పెట్టి
కాలగమనం ఉట్టిని ఎగిరి కొట్టి
విశ్వవిజేత అయ్యావు పట్టుబట్టి
అశ్వగమనవేగంతోని ప్రతినబట్టి !
 
నీవు కాలజ్ఞానం గురించి నేర్చుకో
తావు తప్పని ఓపికను కూర్చుకో
కాలంతో పోటీపడి మరి పరిగెత్తు
గాలంతో కాలాన్ని చేసేయ్ చిత్తు !

కాలం నీమది విన్నపాన్ని మన్నించి
నీ క్షేమం గూర్చి తానిక  ఆలోచించి
ఆగిపోవచ్చును గమనాన్ని తగ్గించి
మదిలోని ఫలం ఫలితాన్ని మగ్గించి

కాలాన్ని ఆపిన పురాణ వ్యక్తులున్నారు
హనుమ,అనసూయ సంయుక్తంగా కనిపిస్తున్నారు
ఆ మహనీయులే మనకు మార్గదర్శకులు
ఆ కాల గమనాన్ని ఆపిన మన పురాణ ప్రదర్శకులు !


కామెంట్‌లు