మేడే దినోత్సవం!;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి. సెల్.9491387977. నాగర్ కర్నూల్ జిల్లా.
మే డే వచ్చింది చూడు
ఉత్సవాల పాట పాడు
విని వస్తారులే జనం
కలసి నిలుస్తారు తోడు

మే డే న మా డే అని
ముందుగానే తెలుసుకొని
జరుపుదాం ఉత్సవాలు
ఉండాలి ఇక మేలుకొని !

కార్మికులకు గుర్తింపు
తెచ్చిన దినమని తెలుపు
బాధ్యత మనపై ఉన్నది
అందరిని మేలుకొలుపు !

శ్రమించే కార్మికులు
వారు మన ధార్మికులు
అని ఎప్పుడూ మరవద్దు
సంపద నిచ్చే శ్రామికులు!

శ్రామిక లోకం దినమిది
ఐనా కూడా మన అందరిది
పాల్గొందాంలే  ఇందు
ఉండదులే ఇక ఇబ్బంది !

చికాకో కార్మికుల
ఐక్యతా శక్తి ఇల
సృష్టించెను ప్రభంజనం
మొదలాయే గోల గోల !


కామెంట్‌లు