శాస్త్రాల పిల్లలం!;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.
మేం వస్త్రాలను నేసేటి పిల్లలం
మా అస్త్రాలను వేసేటి మల్లెలం
శాస్త్రాలను నేర్చుకున్న వారలం
దస్త్రాలను కూడ్చుకున్న పోరలం !

నేతన్నల బీద కుటుంబం మాది
చెప్పుకుంటేనే తెలిసేది మా సోది
అమ్మానాన్నలకు మేం అంటే ప్రేమ
మాకోసం నిత్యం పడేవారు శ్రమ !

అస్త్ర శాస్త్రం చదివేవారంట నాన్న
సమస్త శాస్త్ర విద్యలో వారే మిన్న
అని చెప్తుండేది మమ్ము కన్న అమ్మ
వినగానే ఆరలేదు మా కంటి చెమ్మ!

అమ్మ నాన్నల మాటే మాకిక వేదం
ఇక మా కుండదులే ఎలాంటి ఖేదం
వారికోసం చిందిస్తాంలే మా స్వేదం
వారితో చేయంలే  మేం వాగ్వాదం!

ఆయుధ పూజ చేసేవాడు  నాన్న
పూజ సామాగ్రి సిద్ధం చేసేది అమ్మ
ఊరోలందరూ పూజకు వచ్చేవారు
కట్నం కానుకలను కూడ ఇచ్చేవారు

అస్త్ర శాస్త్రాల గ్రంథాన్ని రాశాడు
సర్వశాస్త్రాల ప్రబంధమని వేశాడు
ముందు తరానికి  దారి చూపిండు
వారి ఆలింగనంకై చేతులు చాపిండు!

అలాంటి అమ్మానాన్నలింక లేరు
మా కంటికి కనిపించ లేకున్నారు
వారి శాస్త్ర గ్రంథాలే మాకిక  గతి
వాటితోనే సాధిస్తాం మేం ప్రగతి!

అమ్మ నాన్నల బాటలోనే నడుస్తాం
నిమ్మకు నీరెత్తకుండ మేం నిలుస్తాం
భక్తితో వారిని ప్రతి నిత్యం కొలుస్తాం
అనురక్తితో ఇక మా మదిలో తలుస్తాం !


కామెంట్‌లు