మా ముత్యాల హారాలు- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
1). మనకు ముత్యాల హారాలు
     మెరిసేటి మణిహారాలు
     కావాలి ఇక మన పాలు
     చేయకండి నేలపాలు !

2). మణిహారాలను ధరించి
     మన హారాలను గురించి
    తెలుసుకోండిక గాలించి
     మన వేదికని భావించి !

3). ఇందు నాలుగు పాదాలు
      ఇవి సులువైన హారాలు
      అసలు ఉండవు వాదాలు
      అని కొట్టండిక బాజాలు !

4). ద్వారాలకివి అందాలు
     పంచుకొనులే బంధాలు
     పలుకగా ఆహ్వానాలు
     ఇచ్చు ఆశీర్వాదాలు !

5). వీటికున్నవి సూత్రాలు
      అవే వాటికి గోత్రాలు
      ఉండు సరైన మాత్రలు
     చూస్తేను మీ నేత్రాలు !

6). హారాలను ఇక అల్లండి
     వేదిక పైకిక వెళ్లండి
     మన సభ్యులను కలవండి
     బాసటగాను నిలవండి !

7). ముత్యాల హారాల తేరు
      ఎక్కి చూడండిక మీరు
      కనిపించును వాటి సౌరు
      చూస్తే ఇక మది విప్పారు !

8). మన ముత్యాల హారాల
      జిగేలుమను అందాల
      చూడు ఓ తెలుగు బాల
       దిశ దశల మూల మూల !


కామెంట్‌లు